Samantha : సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్లిన సమంత

సమంత విడాకులు అనే మైండ్ సెట్ నుంచి బయటకి రావడానికి చాలా బిజీగా ఉండటానికి ట్రై చేస్తుంది. వరుస షూటింగ్స్ లో పాల్గొంటుంది. అయితే ఇప్పుడు ప్రశాంతత కోసం తన స్నేహితులతో కలిసి డివోషనల్

10TV Telugu News

Samantha :  చైతన్య సమంతలు విడాకులు తీసుకున్న తర్వాత సమంతని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం, ఆ ట్రోల్ల్స్ కి సమంత ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక విడాకులు తీసుకున్న దగ్గరినుంచి సమంత రోజూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు తన లైఫ్ కి తన పరిస్థితులకి అర్ధం వచ్చేలా పెట్టడం విశేషం. ఇక విడిపోయిన దగ్గరినుంచి చైతన్య ఇప్పటిదాకా సోషల్ మీడియాలోకి రాలేదు. సామ్ మాత్రం రోజూ పోస్టులతో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. విడాకుల ముందు జిమ్ వీడియోలు రెగ్యులర్ గా పోస్ట్ చేసేది. తాజాగా చాలా గ్యాప్ తర్వాత ఇటీవల మళ్ళీ జిమ్ వీడియోలు పోస్ట్ చేసింది.

SaiDharam Tej : చేతిలోనే చెయ్యేసి.. సాయి ధరమ్ తేజ్ తో హరీష్ శంకర్

సమంత విడాకులు అనే మైండ్ సెట్ నుంచి బయటకి రావడానికి చాలా బిజీగా ఉండటానికి ట్రై చేస్తుంది. వరుస షూటింగ్స్ లో పాల్గొంటుంది. అయితే ఇప్పుడు ప్రశాంతత కోసం తన స్నేహితులతో కలిసి డివోషనల్ టూర్ కి వెళ్ళింది. తాజాగా స్నేహితుల‌తో క‌లిసి ఉత్తరాఖండ్ యాత్ర‌కు వెళ్లింది సామ్‌. ఉత్త‌రాఖండ్‌లోని ఓ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన ఫొటోల‌ను, అక్కడ అడవి ఫోటోల్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. మానసిక ప్ర‌శాంత‌త కోసం ఆధ్మాత్మిక మార్గంలో సమంత రిషికేశ్‌లో పర్యటిస్తుంది. అయితే అక్కడ ఓ ఆశ్రమం దగ్గర ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో మనం ఏం వెతుకుతున్నాము సంతోషన్నా? అంటూ ఆనందం గురించి ఉన్న పోస్ట్ ని షేర్ చేసింది. ఈ పోస్ట్ తో సమంత సంతోషాన్ని వెతుక్కుంటూ కొన్ని రోజులు ప్రశాంతత కోసం వెళ్లినట్టు తెలుస్తుంది.