Samantha: సమంత సంచలన ప్రకటనలు.. 5సార్లు వార్తల్లో నిలిచింది

సమంత నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఎందుకు వారిద్దరూ విడిపోయారనే విషయాన్ని మాత్రం ఇరు కుటుంబాలూ ప్రకటించలేదు.

Samantha: సమంత సంచలన ప్రకటనలు.. 5సార్లు వార్తల్లో నిలిచింది

Samantha

Samantha: సమంత నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఎందుకు వారిద్దరూ విడిపోయారనే విషయాన్ని మాత్రం ఇరు కుటుంబాలూ ప్రకటించలేదు. కానీ, వారు విడిపోయిన తర్వాత వారికి సంబంధించిన ప్రతీ విషయంలో వార్తల్లో ముఖ్యాంశంగా నిలుస్తున్నాయి. అయితే, నిర్మొహమాటంగా, స్ట్రైట్‌గా మాట్లాడి సమంత ఇప్పటివరకు ఐదు సార్లు వార్తల్లో నిలిచారు. బోల్డ్‌గా కామెంట్స్ చెయ్యడంపై కొన్నిసార్లు విభిన్న వాదనలు వినిపించాయి.

ఫుడ్ కంటే సెక్స్ ఎక్కువ:
సమంత ఇచ్చిన సంచలన సమాధానాల్లో ఒకటి “ఫుడ్ కంటే సెక్స్ ఎక్కువ” అనే కామెంట్.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఫుడ్, సెక్స్‌లో ఏది ఎక్కువ అని ప్రశ్న వేయగా.. “సెక్స్, ఫుడ్.. వీటిలో ఒక దాన్ని ఎంచుకోవడం కష్టమే. అయితే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం సెక్స్’ అంటూ సమంత బోల్డ్‌గా సమాధానం ఇచ్చేసింది. ఈ సమాధానంతో దేశవ్యాప్తంగా ప్రధాన వార్తల్లో నిలిచారు సమంత.

క్యాస్టింగ్ కౌచ్‌ గురించి:
ఇండస్ట్రీలో తాను ఎప్పుడూ క్యాస్టింగ్ కౌచ్‌ను అనుభవించలేదని, కానీ క్యాస్టింగ్ కౌచ్ లేదని మాత్రం చెప్పలేమని సమంత చెప్పిన సమాధానం కూడా వార్తల్లో ముఖ్యాంశంగా నిలిచింది. కాస్టింగ్ కౌచ్ అనేది సినీ పరిశ్రమలోనే కాదు ప్రతి పరిశ్రమలోనూ ఉందని, గ్లామర్ పరిశ్రమ కాబట్టి సినిమా పరిశ్రమలో బయటకు వస్తూ ఉంటుందని సమంత ఇంటర్వ్యూలో వెల్లడించింది. లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిశీలించడానికి ప్రభుత్వం ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని సమంత సూచించింది.

గర్భధారణ పుకార్లు గురించి:
సమంత నాగ చైతన్య వివాహం జరిగినప్పటి నుంచి సమంతకు ప్రతీ ఇంటర్వ్యూలో ఎదురయ్యే ప్రశ్న ఆమె గర్భధారణ గురించి.. సమంత ప్రెగ్నెన్సీ పుకార్లు చక్కర్లు కొట్టాయి. సమంత ప్రతిసారీ అటువంటి ప్రశ్నలకు గట్టిగానే సమాధానం ఇస్తుంది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు “‘అవును నేను 2017 నుంచి గర్భవతినే. ఎందుకోగానీ బేబీ బయటకు రావడం లేదు” సమాధానం ఇచ్చింది.

పురుషాధిపత్య పరిశ్రమపై వ్యాఖ్యలు:
పురుషాధిపత్య పరిశ్రమలో భాగంగా ఉన్నప్పటికీ, సమంత తన పనితో తాను ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పురుషుల ఆధిక్యంలో ఉన్నప్పుడు ఏ మహిళకైనా మన ధైర్యంతో మనం ముందుకు వెళ్లొచ్చని పిలుపునిచ్చారు. పురుషుల ఆధిక్యంలో ఉన్నా మన ధైర్యంతో మనం ముందుకు వెళ్లొచ్చని సమంత అభిప్రాయపడ్డారు.

నటనకు బ్రేక్: రెండు, మూడేళ్లలో సమంత తన నట జీవితానికి బ్రేక్ ఇస్తుందని ఒకసారి వార్తలు వచ్చాయి. అయితే, దీని గురించి ఆమెను అడిగినప్పుడు.. ఆమె మాట్లాడుతూ, నేను సినిమా పరిశ్రమకు వీడ్కోలు చెబుతానని ఎప్పుడూ చెప్పలేదు. ఇంకా దశాబ్దానికిపైగా సినిమాలు చేస్తానని చెప్పింది.