Samantha : నన్ను ఐటెం సాంగ్ చెయ్యొద్దన్నారు.. విడాకులు తీసుకున్నాక ఇంట్లో కూర్చోమన్నారు.. సమంత సంచలన వ్యాఖ్యలు..

శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత తన విడాకుల తర్వాత లైఫ్ గురించి, పుష్ప ఐటెం సాంగ్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది.............

Samantha : నన్ను ఐటెం సాంగ్ చెయ్యొద్దన్నారు.. విడాకులు తీసుకున్నాక ఇంట్లో కూర్చోమన్నారు.. సమంత సంచలన వ్యాఖ్యలు..

Samantha sensational comments on her divorce and pushpa item song

Samantha :  సమంత(Samantha) నాగ చైతన్యతో(Naga Chaitanya) విడాకుల(Divorce) తర్వాత కొన్ని రోజులు సినిమాలకు, సోషల్ మీడియాకు(Social Media) గ్యాప్ ఇచ్చి యశోద(Yashoda) నుంచి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత మయోసైటిస్ వచ్చిందని చెప్పి కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి దాన్నుంచి కోలుకొని ఇటీవల వర్క్ లోకి కంబ్యాక్ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సమంత ఓ పక్క సినిమా షూటింగ్స్ తో మరో పక్క సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. సమంత మెయిన్ లీడ్ లో నటించిన శాకుంతలం(Shakunthalam) సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

దుశ్యంతుడు – శకుంతల కథ ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక శాకుంతలం సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవ్వడంతో ముంబైలో కూడా సమంత భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా వరుసగా బాలీవుడ్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది సమంత. వీటిల్లో సమంత మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలని తెలిపింది.

Samantha : మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు.. హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ పై సమంత వ్యాఖ్యలు..

శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత తన విడాకుల తర్వాత లైఫ్ గురించి, పుష్ప ఐటెం సాంగ్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. సమంత మాట్లాడుతూ.. విడాకులు అయ్యాక నేను ఐటెం సాంగ్ ఒప్పుకుంటే నా స్నేహితులు, ఫ్యామిలీ వాళ్ళు కూడా చెయ్యొద్దన్నారు. కొన్ని రోజులు సైలెంట్ గా ఇంట్లో కూర్చోమన్నారు. విడాకులు అయిన వెంటనే ఐటెం సాంగ్ చేస్తే బాగోదు అన్నారు. నేను నా మ్యారేజ్ లో వందశాతం ఇచ్చాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. నేను చేయని తప్పుకు నేనెందుకు భయపడాలి, నేనెందుకు బాధపడాలి. నేను దానికి గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు అని తెలిపింది. అలాగే విడాకుల తర్వాత.. మానసికంగా, ఆరోగ్యంగా ఎన్నో బాధలు చూశాను. నన్ను ట్రోల్ చేశారు, కామెంట్స్ చేశారు. నేను చూసిన బాధలు ఏ నటికి కూడా రాకూడదు అని కామెంట్స్ చేసింది. దీంతో సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.