Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ వచ్చేది ఏకంగా అప్పుడేనా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ కోసం అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, పూర్తి మైథలాజికల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై అందరిలో అంచనాలను పెంచేశాయి.

Shaakuntalam: సమంత ‘శాకుంతలం’ వచ్చేది ఏకంగా అప్పుడేనా..?

Shaakuntalam: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’ కోసం అభిమానులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తుండగా, పూర్తి మైథలాజికల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై అందరిలో అంచనాలను పెంచేశాయి.

Shaakuntalam : ‘శాకుంతలం’కి తన సంగీతంతో ప్రాణం పోస్తున్న మణిశర్మ.. ఏలేలో ఏలేలో!

ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తుండగా, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడబోతుందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా బాలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘షెహజాదా’ చిత్రాన్ని ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 17కు రిలీజ్ డేట్‌ను మార్చారు.

ఈ ఎఫెక్ట్ ఇప్పుడు శాకుంతలంపై పడిందని.. బాలీవుడ్‌లో థియేటర్ల సమస్య తలెత్తుతుందనే కారణంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. ఇక శాకుంతలం చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చూస్తోందట. ఈ క్రమంలోనే ఏప్రిల్ 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయట. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నిజంగానే మరోసారి వాయిదా వేస్తున్నారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.