Samantha : టర్కీలో సమంత.. కాలింగ్ హోప్ అంటూ ..

శామ్ టర్కీలో షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలను అభిమానులకు షేర్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషీ సినిమాకు సంబంధించి టర్కీలో ఓ పాట షూటింగ్ జరుగుతోంది.

Samantha : టర్కీలో సమంత.. కాలింగ్ హోప్ అంటూ ..

Samantha

Samantha : వయసు పెరుగుతున్నా.. హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతున్న సమంత అందం ఏ మాత్రం తగ్గట్లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వర్కౌట్లు మానకపోవడం కూడా ఆమె గ్లామర్ సీక్రెట్ కావచ్చు. తాజాగా శామ్ ఖుషీ సినిమా షూటింగ్ కోసం టర్కీలో ఉన్నారు. అక్కడ వర్కౌట్లు చేస్తున్న ఫోటోలతో పాటు మరికొన్ని ఫోటోలను షేర్ చేశారు. అవి చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Samantha : ఆ సిరీస్ లో ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత.. నిజమేనా? సమంత ఏమంది?

శామ్ ప్రస్తుతం టర్కీలో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషీ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు తన ట్రైనర్‌తో కలిసి వర్కౌట్లు చేస్తున్నారు. ‘బాధను పంచుకోవడంలో కూడా ఎప్పుడూ సంతోషం ఉంటుంది’ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసుకున్నారు. అలసిపోయిన తర్వాత ఐస్ క్రీం తింటున్నట్లు చేత్తో ఐస్ క్రీం కప్పు పట్టుకున్న ఫోటోను షేర్ చేశారు శామ్.

Samantha : ఖుషి షూటింగ్.. టర్కీలో ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంత

సమంత ఓ పబ్లిక్ బూత్ దగ్గర రిసీవర్‌ను పట్టుకుని చిరునవ్వుతో ‘కాలింగ్ హోప్’ అని రాసిన ఫోటోను షేర్ చేశారు. విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమాకు సంబంధించి టర్కీలో ఓ పాట షూటింగ్ జరుగుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. గతేడాది కాశ్మీర్‌లో సగ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సమంత అనారోగ్య కారణాల వల్ల కాస్త లేటైంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.