Samantha : ఇప్పటికింకా నా వయసు పదహారే.. 16 ఏళ్ళప్పటి సమంత ఎలా ఉందో చూశారా?

తాజాగా సమంత తన సోషల్ మీడియాలో తన 16 ఏళ్ళప్పటి ఫొటో ని షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఈ ఫొటో ఉంది.

Samantha : ఇప్పటికింకా నా వయసు పదహారే.. 16 ఏళ్ళప్పటి సమంత ఎలా ఉందో చూశారా?

Samantha shares her 16 years old photo

Samantha : స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఇటీవలే శాకుంతలం(Shakunthalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని పాన్ ఇండియా(Pan India)రిలీజ్ చేసినా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం సమంత బాలీవుడ్(Bollywood) లో సిటాడెల్(Citadel) సిరీస్, తెలుగులో ఖుషి(Kushi) సినిమా చేస్తుంది. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. శాకుంతలం ప్రమోషన్స్ కి సమంత ఇండియా అంతా తిరిగింది. ఇటీవల సమంత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా సమంత తన సోషల్ మీడియాలో తన 16 ఏళ్ళప్పటి ఫొటో ని షేర్ చేసింది. బ్లాక్ అండ్ వైట్ లో ఈ ఫొటో ఉంది. ఇందులో సమంత మోకాళ్ళ వరకు ఉన్న టాప్ వేసుకొని దానిపై కోటు వేసుకుంది. మెడలో కొన్ని పూసల దండాలు వేసుకొని ఓ సోఫాలో కూర్చుంది. ఈ ఫొటో చూస్తుంటే పాత కాలం నాటి హీరోయిన్ లా ఉంది సమంత. ఈ ఫొటో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి 16 ఏళ్ళప్పుడు నేనే అని క్యాప్షన్ ఇచ్చింది.

Image

Vikram Stylish looks : ఏం స్టైల్ రా బాబు.. అల్ట్రా స్టైలిష్ లుక్స్‌లో విక్రమ్..

సమంత 16 ఏళ్ళప్పటి ఫొటో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు, అభిమానులు.. ఈ ఫొటోలో ఉంది నువ్వేనా, అప్పుడు ఇంకా క్యూట్ గా ఉన్నావు, చాలా మారిపోయావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.