Samantha : మనం చేయగలిగే లక్ష్యాలనే పెట్టుకోవాలి.. చాలా రోజుల తర్వాత తన ఫొటోతో సమంత పోస్ట్..

 ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉన్న సమంత విడాకుల తర్వాత కూడా మరింత యాక్టీవ్ గా ఉండేది. రోజూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, పోస్ట్ లు పెట్టేది. కానీ కొన్ని నెలలుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. ఇటీవల...........

Samantha : మనం చేయగలిగే లక్ష్యాలనే పెట్టుకోవాలి.. చాలా రోజుల తర్వాత తన ఫొటోతో సమంత పోస్ట్..

Samantha shares new year post emotionally

Samantha :  ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉన్న సమంత విడాకుల తర్వాత కూడా మరింత యాక్టీవ్ గా ఉండేది. రోజూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు, పోస్ట్ లు పెట్టేది. కానీ కొన్ని నెలలుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. ఇటీవల యశోద సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించింది సమంత. ఆ టైంలో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినా ఆ తర్వాత నుంచి కూడా సోషల్ మీడియాలో అసలు పోస్టులు పెట్టట్లేదు. అదే సమయంలో తనకి మాయోసైటిస్ సోకిందని, చికిత్స తీసుకుంటున్నానని కూడా చెప్పడంతో అభిమానులు, ప్రేక్షకులు, ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

ఇటీవలే కొన్ని రోజుల క్రితం నటుడు రాహుల్ రవీంద్రన్ సమంతకి ఒక కొటేషన్ ని ఫ్రేమ్ చేసి ఇవ్వగా దాని గురించి షేర్ చేసి మరింత స్ట్రాంగ్ గా తయారవుతాను అంటూ పోస్ట్ చేసింది. తాజాగా చాలా రోజుల తర్వాత తన ఫోటోని షేర్ చేసి సమంత పోస్ట్ పెట్టింది.

Vicky kaushal : ఈ హీరో పిజ్జాలు, బర్గర్లు తింటే బరువు తగ్గుతాడంట.. అమితాబ్ తో సహా అంతా ఆశ్చర్యపోతున్నారు..

సమంత పడుకొని నవ్వుతూ ఉన్న క్లోజ్ ఫోటోని షేర్ చేస్తూ.. మనం ముందుకెళ్లాలి. కొత్త, సరైన, సులభమైన లక్ష్యాల్ని నిర్దేశించుకోవడానికి ఇదే సరైన సమయం. దేవుడి ఆశీస్సులు ఉంటాయి. హ్యాపీ 2023 అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ సంవత్సరం కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకోండి అని చెప్తూ సమంత ఈ పోస్ట్ పెట్టింది. మరి సమంత ఏ లక్ష్యాల్ని నిర్దేశించుకుంటుందో ఈ సంవత్సరం. సమంత మాయోసైటిస్ నుంచి కోలుకొని త్వరగా సినిమాలు వరుసగా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.