Samantha : అలా చచ్చిపోతే నా అదృష్టం.. సమంత సంచలన వ్యాఖ్యలు..

తాజాగా ఇటీవల తన కుక్కలతో ఉన్న ఓ ఫోటోని సమంత షేర్ చేయగా ఓ నెటిజన్ ఆ ఫోటోకి స్పందిస్తూ.. సమంత తన పెట్స్‌ కుక్కలు, పిల్లులతో............

Samantha : అలా చచ్చిపోతే నా అదృష్టం.. సమంత సంచలన వ్యాఖ్యలు..

Samantha

Samantha :  చైతూతో విడాకుల తర్వాత సమంత కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టింది. వరుస సినిమాలని ఓకే చేస్తూ షూట్స్ తో బిజీబిజీగా గడుపుతుంది. ఇక విడాకుల అనంతరం సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్ గా ఉంటుంది సమంత. రోజూ లైఫ్, లవ్ కి సంబంధించిన ఏదో ఒక కొటేషన్స్ లాంటివి షేర్ చేస్తూ నెటిజన్లని అయోమయంలో పడేస్తుంది. వీటితో పాటు తన ఫోటోలని కూడా బాగానే షేర్ చేస్తుంది.

ఇక సమంత దగ్గర రెండు కుక్కలు ఉన్న సంగతి తెలిసిందే. తన కుక్కలు అంటే సమంతకి చాలా ఇష్టం. వర్క్, షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఆ కుక్కలతో సమయం గడుపుతుంది. ఇప్పటికే ఆ కుక్కలతో పలు ఫోటోలని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సమంత. తాజాగా ఇటీవల తన కుక్కలతో ఉన్న ఓ ఫోటోని సమంత షేర్ చేయగా ఓ నెటిజన్ ఆ ఫోటోకి స్పందిస్తూ.. సమంత తన పెట్స్‌ కుక్కలు, పిల్లులతో ఆమె ఒంటరిగా చనిపోవాలి అంటూ కామెంట్‌ పెట్టాడు.

Kevin Speacy : పురుషులపై లైంగిక వేధింపులు.. ఆస్కార్‌ అవార్డు గ్రహీతపై కేసు..

అయితే ఈ కామెంట్ చూసిన వారంతా ఆ నెటిజన్ ని ఇలా మాట్లాడతావా అంటూ విమర్శిస్తుంటే సమంత మాత్రం కూల్ గా రిప్లై ఇచ్చింది. అతను చేసిన కామెంట్ కి అలా జరిగితే అంతకన్నా అదృష్టం ఉండదు నాకు అని రిప్లై ఇచ్చింది. మొత్తానికి సమంత తన కుక్కలతో ఒంటరిగా చనిపోతే అదృష్టవంతురాలు అని భావిస్తుంది. సమంత ఇలాంటి రిప్లై ఇవ్వడంతో ఆమె పాజిటివ్ గా తీసుకుంది అంటూ పొగుడుతున్నారు. అయితే తర్వాత అతను ఆ ట్వీట్ ని డిలీట్ చేయడం విశేషం.