Samantha : మంచులో దూసుకెళ్తూ.. స్విట్జర్లాండ్‌లో సమంత స్కైయింగ్..

ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్‌ ట్రిప్ లో ఉంది. అక్కడ ఐస్ లో స్కైయింగ్ చేస్తూ ఆ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. అక్కడ ఐస్ లో రకరకాలుగా స్కైయింగ్ చేస్తూ మంచులో సాహసాలు చేస్తుంది...

Samantha : మంచులో దూసుకెళ్తూ.. స్విట్జర్లాండ్‌లో సమంత స్కైయింగ్..

Samantha Skiing

Samantha :  చైతూతో విడాకుల అనంతరం సమంత ఒకపక్క వరుస సినిమాలు చేస్తూ మరోపక్క యాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంది లైఫ్ ని. ఇటీవల మన దేశంలోని చార్ ధామ్ లాంటి చాలా ప్లేసెస్ కి ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లి ఎంజాయ్ చేసింది. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇప్పుడు దేశం దాటి వెళ్లి సాహస యాత్రలు చేస్తుంది సమంత. తాజాగా స్విట్జర్లాండ్‌ ట్రిప్ వేసింది సమంత. ఈ ట్రిప్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సమంత.

Samantha : వీళ్లిద్దరి వల్లే బతికున్నా

ప్రస్తుతం సమంత స్విట్జర్లాండ్‌ ట్రిప్ లో ఉంది. అక్కడ ఐస్ లో స్కైయింగ్ చేస్తూ ఆ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. అక్కడ ఐస్ లో రకరకాలుగా స్కైయింగ్ చేస్తూ మంచులో సాహసాలు చేస్తుంది. ఆ వీడియోల్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. మ్యాజిక్ జరిగింది అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది. ”మీ అహాన్ని ఇంట్లోనే వదిలి బయటకి వెళ్ళండి. ఇంతకంటే మంచి మాటలు చెప్పలేను” అంటూ తను స్కైయింగ్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది సమంత. ఇలా సమంత కొత్తగా సాహస యాత్రలు చేస్తూ ఆ వీడియోలు షేర్ చేస్తుంది. సమంత అభిమానులు ఈ వీడియోలు చూసి మురిసిపోతూ వాటిని వైరల్ చేస్తున్నారు.