Samantha : చైతూతో విడిపోయిన తర్వాత చనిపోతా అనుకున్నాను : సమంత

తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన జీవితం గురించి, చైతూతో విడిపోయిన విషయం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సమంత మాట్లాడుతూ.. లైఫ్ లో మనకు చెడ్డ రోజులు......

10TV Telugu News

Samantha :  కొన్ని రోజుల క్రితం సమంత నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసందే. వీరిద్దరూ విడిపోవడం చాలా రోజుల పాటు వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా మందికి ఇష్టమైన కపుల్ చైతన్య, సమంత. వీరిద్దరూ ఒకే పోస్ట్ ఒకే సారి పెట్టి విడిపోయారు. ఆ తర్వాత ఈ విషయంలో సమంతని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. యూట్యూబ్ లో కూడా సమంతపై తప్పుడు వీడియోలు ప్రసారం చేశారు. దీనిపై సమంత ఫైర్ అయింది కూడా. కొన్ని రోజుల తర్వాత ఈ విషయంపై మాట్లాడటం తగ్గించినా సమంత మాత్రం రోజూ తన జీవితానికి సంబంధించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. దీంతో మళ్ళీ సోషల్ మీడియాలో సమంత గురించి రోజూ చర్చ నడుస్తుంది.

Movies : ఈ వారం థియేటర్ / ఓటిటిలో వచ్చే సినిమాలు

చైతూతో విడిపోయిన తర్వాత సమంత సినిమాలలో బిజీగా ఉంది. వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ దూసుకెళ్లిపోతుంది. తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన జీవితం గురించి, చైతూతో విడిపోయిన విషయం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సమంత మాట్లాడుతూ.. లైఫ్ లో మనకు చెడ్డ రోజులు వస్తాయి. వాటిని మనం అర్ధం చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయలేకపోతే రోజూ దానితో పోరాడాలి. ఇది ఎప్పటికీ అంతం లేని ఒక ప్రాసెస్. అలాగే విడిపోవడం అనేది నా సమస్య. కాని నేను నా జీవితాన్ని గడపాలి అనుకున్నాను కాబట్టి. ఆ సమస్యను అంగీకరించాను. అది మర్చిపోయి జీవితంలో ముందుకెళ్లాలని నేను ఫిక్స్ అయ్యాను అని తెలిపింది.

Kamal Hassan : కమల్‌హాసన్‌పై సీరియస్.. స్టాలిన్ సర్కార్ నోటీసులు

అంతే కాక ఇప్పుడు నా వ్యక్తిగత జీవితంలో నేను చాలా సమస్యలు ఎదుర్కున్నాను. నేను ఎదుర్కొంటున్న అన్ని సమస్యలతో, నేను ఎంత బలంగా ఉన్నానో అని నేనే ఆశ్చర్యపోయాను. నేను చాలా బలహీనురాలు అని అనుకునే దాన్ని. చైతూతో విడిపోయాక ఆ బాధలో నేను కృంగిపోయి చనిపోతానని అనుకున్నాను. కాని నేను చాలా దృఢంగా ఉన్నాను. ఇంత దృడంగా ఉండగలనని అని నేనే అనుకోలేదు. ఈ రోజు నేను ఎంత బలంగా ఉన్నానో నాకు తెలుసు. ఇందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నేను నిజంగానే చాలా బలంగా ఉన్నాను అని తెలిపింది. చైతూతో విడాకుల విషయంపై ఫస్ట్ టైం ఈ రేంజ్ లో మాట్లాడటంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

×