Samantha : పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత

సమంత పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మై మామ్‌ సెడ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో ప్రస్తుతం తను ఉన్న పరిస్థితులకు తగ్గట్టు పోస్టులు పెడుతున్నారు. ఇటీవలే

Samantha : పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత

Samantha (1)

Samantha :  నాగ చైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించిన అనంతరం సమంత సోషల్‌ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తుంది. నాగ చైతన్య సోషల్ మీడియాకి దూరంగా ఉంటుండగా సమంత మాత్రం తన పరిస్థితులను అన్వయించేలా రోజూ పోస్టులను పెడుతుంది. సమంత పెట్టే పోస్టులు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మై మామ్‌ సెడ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో ప్రస్తుతం తను ఉన్న పరిస్థితులకు తగ్గట్టు పోస్టులు పెడుతున్నారు. ఇటీవలే సంతోషం కోసం చార్ ధామ్ యాత్రకు వెళ్లానంటూ అక్కడి ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. యాత్ర ముగించుకొని వచ్చిన సమంత తాజాగా పెట్టిన ఓ పోస్టు మరోసారి వైరల్ అవుతుంది.

Ghani : నిన్నెంటి.. మొన్నెంటి.. నీకెందుకు.. ‘గని’ నుంచి అదిరిపోయే ఇన్స్పిరేషనల్ సాంగ్

ఇండియన్ వుమెన్ హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ పెట్టిన పోస్టుని షేర్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది సమంత. ఈ పోస్ట్ లో పెళ్లి గురించి మాట్లాడింది. మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారని కంగారు పడకుండా తనని సమర్థంగా తీర్చిదిద్దండి. తన పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు తన చదువుకు ఖర్చు పెట్టండి. ఆమెను పెళ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయండి. అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించండి. ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి అని తెలిపింది. ఇలా అమ్మాయిల పెళ్లి గురించి మాట్లాడటంతో మరోసారి సమంత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.