Samantha: కుక్కకు సమంత బర్త్‌డే విషెస్‌.. నెటిజన్ల ఆగ్రహం!

సమంతా నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఆమాటకొస్తే సినిమాలు, నటనతో సంబంధం లేకుండా ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉండటం సమంతాకు అలవాటే. కాకపోతే గతం వేరు.. ప్రస్తుతం వేరు.

Samantha: కుక్కకు సమంత బర్త్‌డే విషెస్‌.. నెటిజన్ల ఆగ్రహం!

Samantha

Samantha: సమంతా నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఆమాటకొస్తే సినిమాలు, నటనతో సంబంధం లేకుండా ఎప్పుడూ హెడ్ లైన్స్ లో ఉండటం సమంతాకు అలవాటే. కాకపోతే గతం వేరు.. ప్రస్తుతం వేరు. చై నుంచి సపరేటయిన తర్వాత సామ్ ఎక్కువగా నెగెటివ్ వార్తల్లోనే నానింది. అందుకే ఆ నెగెటివిటీ నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక యాత్రలు చేసింది. దేశ, దేశాలకు స్నేహితులతో కలిసి విహార యాత్రలు చేసి.. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Drushyam 2 Telugu: అమెజాన్‌లో వచ్చేసిన వెంకీ మరో దృశ్యం!

కానీ.. సోషల్ మీడియాలో పోస్టులు మాత్రం ఆపడం లేదు. సామ్ రోజూ ఏదో ఒక పోస్ట్ పెట్టాల్సిందే. అయితే.. తాజాగా మాజీ భర్త నాగ చైతన్య బర్త్ డే అన్న సంగతి తెలిసిందే. చై పుట్టినరోజుకు ఇటు ఫ్యామిలీతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు బర్త్‌డే విషెష్ తెలియచేశారు. కానీ సమంత మాత్రం చైకి ఎలాంటి విషెష్ తెలపలేదు. నెటిజన్లు కూడా పోనీలే పాపం ఎంతయినా వాళ్ళ ఇద్దరికీ సెట్ కాకేకదా విడిపోయింది.. ఇంక విషెష్ ఎలా చెప్తార్లే అని సర్దుకుపోయారు.

Akhanda: ఎన్నో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్‌తో అఖండ!

అయితే, మరుసటి రోజే సామ్ తన పెంపుడు కుక్క ‘హాష్’కు బర్త్‌డే విషెస్‌ తెలిపింది. దానితో ఆమెకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో కొన్ని ఫోటోలను షేర్ చేసి స్పెషల్ గా విషెష్ చెప్పింది. దీంతో కొందరు నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. పెంపుడు కుక్కకు ఇచ్చిన ప్రాధాన్యత, మాజీ భర్తకి ఇవ్వలేవా అంటూ సామ్ నే అడిగేస్తున్నారు. మొన్నటి వరకు భర్త, కో స్టార్ కూడా.. కనీసం ఒక ఫ్రెండ్ లాగా కూడా చెప్పలేకపోయావా అని నిలదీస్తున్నారు.. సామ్ కావాలనే ఇలా చేస్తుందని డై హార్డ్ అక్కినేని ఫ్యాన్స్ వాపోతున్నారు.