Samantha : నువ్వు నా పక్కనే నిల్చునే స్నేహితుడివి.. రౌడీ హీరోపై సమంత స్పెషల్ పోస్ట్..
షూటింగ్ గ్యాప్ లో విజయ్, సమంత టర్కీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. తాజాగా సమంత.. విజయ్ దేవరకొండని ఉద్దేశించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది.

Samantha Special post on Vijay Devarakonda in Instagram
Vijay Devarakonda : సమంత(Samantha) బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి సమంత ఖుషి(Kushi) సినిమా చేస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత మెయిన్ లీడ్స్ లో శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఖుషి సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్స్, ఒక సాంగ్ బాగా వైరల్ అయ్యాయి. దీంతో సమంత, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఖుషి సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు
ఖుషి సినిమా ఇప్పటివరకు కశ్మీర్, కేరళ, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది. ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకోవడానికి వెళ్లారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ, సమంతలపై ఒక సాంగ్, కొన్ని సన్నివేశాలను టర్కీలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇటీవల షూటింగ్ గ్యాప్ లో విజయ్, సమంత టర్కీలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
తాజాగా సమంత.. విజయ్ దేవరకొండని ఉద్దేశించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. విజయ్ తో టర్కీలో లంచ్ చేస్తున్న ఫోటోని షేర్ చేస్తూ.. నీ బెస్ట్ చూశాను, నీ వరస్ట్ చూశాను, నువ్వు లేట్ గా వచ్చినప్పుడు, ముందు వచ్చినప్పుడు చూశాను. నీ సక్సెస్, ఫెయిల్యూర్స్ చూశాను. కొంతమంది స్నేహితులు మన పక్కనే నిలబడతారు. ఖుషి షూటింగ్ మొదలు పెట్టి సంవత్సరం అవుతుంది. అద్భుతమైన సంవత్సరం అంటూ పోస్ట్ చేసింది. దీంతో సమంత విజయ్ దేవరకొండ కోసం స్పెషల్ పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. టర్కీలో షూటింగ్ చేసుకుంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారుగా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.