Samantha : ఎఫైర్లు, అబార్షన్ల వార్తలపై సమంత ఘాటు స్పందన

ఇలాంటి వాటిని ఎన్నటికీ అంగీకరించేది లేదని నేను ప్రామిస్ చేస్తున్నా. తప్పుడు ప్రచారాలన్నీ కట్టుకథలే

Samantha : ఎఫైర్లు, అబార్షన్ల వార్తలపై సమంత ఘాటు స్పందన

Samantha 2

విడాకులు చాలా బాధపెడుతున్నాయి

Samantha : నాగచైతన్య, సమంత విడిపోయిన వార్త తాలూకు కథనాలు రేపుతున్న సంచలనాలు కొనసాగుతున్నాయి. ఓ వైపు… నాగచైతన్య దీనిపై సైలెంట్ గానే ఉంటున్నప్పటికీ… సమంత పెడుతున్న పోస్టులు… మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాము విడిపోతున్నట్టు అధికారికంగా చేసిన ప్రకటన నాటి నుంచి.. ఇప్పటివరకు అనేక కథనాలు మీడియాలో  వచ్చాయి. వీటిపై సమంత మరోసారి రియాక్టైంది. ఈ రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది.

“ఒకరి వ్యక్తిగత జీవిత సంక్షోభంపై మీరు(మీడియా, నెటిజన్లు, పబ్లిక్) చూపిస్తున్న భావోద్వేగం (ఎమోషనల్ ఇన్వెస్ట్‌మెంట్) చూసి నేను సంతోషంతో పొంగిపోతున్నా. మీరు నాపై చూపిన గాఢమైన సానుభూతి.. మీరు నా జీవితంపట్ల చూపిస్తున్న ఆందోళనకు ధన్యవాదాలు తెలుపుతున్నా. నాపై వస్తున్న తప్పుడు కథనాలు, పుకార్లను తిప్పికొడుతున్నందుకు కూడా థాంక్స్. నాకు ఎఫైర్స్ ఉన్నాయనీ.. నేను పిల్లలను ఎన్నడూ కోరుకోలేదని.. నేను అవకాశవాదినని వాళ్లు అంటున్నారు. నేను కొన్ని అబార్షన్స్ కూడా చేయించుకున్నానని ఇపుడు సరికొత్త కథనాలు ప్రచారం చేస్తున్నారు” అని తన మెసేజ్ లో పోస్ట్ చేసింది సమంత.

Chay Sam Breakup : ఆడవాళ్లనే ప్రశ్నిస్తారా?? మగాళ్లని ప్రశ్నించరా?? : సమంత

విడాకులు అనేది ఒకరి జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని సమంత తెలిపింది. ఈ బాధను ఒంటరిగా అనుభవించేందుకు తనకు సమయం, అవకాశం ఇవ్వాలని కోరింది. ఇలాంటి తప్పుడు కథనాలతో తనపై కనికరం లేకుండా దాడి చేయడం కరెక్ట్ కాదంది. ఎఫైర్లు, అబార్షన్లంటూ వస్తున్న కథనాలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. “ఇలాంటి వాటిని ఎన్నటికీ అంగీకరించేది లేదని నేను ప్రామిస్ చేస్తున్నా. ప్రచారంలో ఉన్నవన్నీ కట్టుకథలే. ” అని సమంత సూటిగా వివరణ ఇచ్చింది.