Samantha: అన్నీ మర్చిపోయేలా చేసిన ఊ అంటావా మావా సాంగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప నార్త్ టూ సౌత్ భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ నంబర్స్ కాగా..

Samantha: అన్నీ మర్చిపోయేలా చేసిన ఊ అంటావా మావా సాంగ్!

Samantha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప నార్త్ టూ సౌత్ భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాలోని పాటలన్నీ బ్లాక్ బస్టర్ నంబర్స్ కాగా.. స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావాకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఈ లిరికల్ సాంగ్ కేవలం 20 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్‌ని సాధించి రికార్డులు క్రియేట్ చేయగా.. ఆ తర్వాత ఊ అంటావా మావా ఫుల్ సాంగ్ విడుదల చేస్తే అంతకు మించిన రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాలో అయితే.. ఈ పాటే హైలెట్ గా నిలిచింది.

Oo Antava Mava: సామ్ ఊ అంటావా మావా.. 20 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్!

ఊ అంటావా మావా అంటూ సమంతా గ్లామరస్ ట్రీట్, అల్లు అర్జున్ మాసివ్ స్టెప్స్ తో ఈ పాట దుమ్మురేపగా.. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా, సింగర్ ఇంద్రావతి ఆలపించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. సినిమా ఓటీటీలో వచ్చి నెలలు గడిచినా ఈ పాట ఇంకా ప్రేక్షకుల నోళ్ళలో నానుతూనే ఉంది. ఈ పాట తనకు కూడా స్పెషల్ గానే ఉంటుందని సమంత కూడా పలుసార్లు చెప్పుకొచ్చింది. తాజాగా క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డుల ఫంక్షన్‌కు హాజరైన సామ్‌ మరోసారి ఈ ఐటం సాంగ్‌పై స్పందించింది.

Oo Antava Song: సామ్ స్పెషల్ సాంగ్.. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!

ఊ అంటావా పాటకు ఇంత భారీ స్థాయిలో ఆదరణ లభిస్తుందని ఊహించలేదు. ఇది తెలుగు పాట అయినా కూడా పాన్‌ ఇండియా లెవల్‌లో హిట్టయింది. జనాలు అంతకుముందు నేను చేసిన సినిమాలన్నీ మర్చిపోయి, ఊ అంటావా మావా పాటలో చాలా బాగా చేశానని చెప్తున్నారు. ఇది నిజంగా సంతోషకరం అని చెప్పుకొచ్చింది.