Samantha: టోర్న్ పిన్ డ్రెస్.. చించుకొని పిన్నులు పెట్టుకోవడం ఎందుకు సామ్!

ఏంటో ఈ వింత ఫ్యాషన్ ప్రపంచంలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో తెలియదు. అసలు అది ఫ్యాషన్ ఎలా అవుతుందో కూడా అర్ధమే కాదు. నిన్నటి వరకు టోర్న్ జీన్స్ ట్రెండ్ గా సాగిన సంగతి తెలిసిందే.

Samantha: టోర్న్ పిన్ డ్రెస్.. చించుకొని పిన్నులు పెట్టుకోవడం ఎందుకు సామ్!

Samantha

Samantha: ఏంటో ఈ వింత ఫ్యాషన్ ప్రపంచంలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో తెలియదు. అసలు అది ఫ్యాషన్ ఎలా అవుతుందో కూడా అర్ధమే కాదు. నిన్నటి వరకు టోర్న్ జీన్స్ ట్రెండ్ గా సాగిన సంగతి తెలిసిందే. అదే తెలుగులో చెప్పాలంటే చినిగిపోయిన జీన్స్ ధరించడం. కాగా.. ఇప్పుడు ఆ చిరుగులు పిన్నీసులు పెట్టడమే మరొక స్టైల్. అదే ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ అయిపోతుండడడం విడ్డురంగా అనిపిస్తుంది. అది కూడా సమంతా లాంటి స్టార్ హీరోయిన్ ఈ స్టైల్ ధరించి తెలుగు యువతకి దగ్గర చేస్తుంది.

Antim: ఆగని నిరసన.. ట్విట్టర్‌లో ‘బాయ్‌కాట్ అంతిమ్’ ట్రెండింగ్!

ట్రెండ్‌కు అనుగుణంగా తన స్టైల్‌ను మార్చుకుంటూ టాలీవుడ్‌లో ఫ్యాషన్ లేడీగా పేరు తెచ్చుకున్న నటి సమంత. వెరైటీ డ్రెస్సులతో ఎప్పటికప్పుడు తనకు లేదు సాటి అనేలా మెరిపించే సామ్ ఇప్పుడు టోర్న్ పిన్ డ్రెస్ లో కనిపించడంతో అందరూ ఇప్పుడు దీనిగురించి మాట్లాడుకుంటున్నారు. టోర్న్ పిన్ డ్రెస్‌లో తళుక్కుమన్న సామ్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Muddy: దిల్ రాజు చేతికి తెలుగు రైట్స్.. బొమ్మ పక్కా హిట్టా?

ఇప్పటికే హాలీవుడ్‌, బాలీవుడ్‌ తారలు కొంతమంది భారీ పిన్నీసులతో ఉన్న డ్రెస్‌లను ధరించి గతంలో ఆశ్చర్యపరిచారు. ఆ మధ్య బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ఇలాంటి డ్రెస్‌ వేసుకుని ఫొటోలకు పోజులివ్వగా.. ఇప్పుడు సమంత కూడా టోర్న్‌-పిన్‌ డ్రెస్‌లో కనువిందు చేసింది. కొందరు సామ్ ఫ్యాషన్ ను చూసి ఆహా ఓహో అని ఆకాశానికి ఎత్తేస్తుంటే మరికొందరు మాత్రం అసలు చించుకోవడం ఎందుకు.. చించుకొని మళ్ళీ పిన్నులు పెట్టుకోడం ఎందుకు మా ఖర్మ కాకపోతే అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.