Samantha : పెద్దమ్మ తల్లి టెంపుల్ లో శాకుంతలం టీంతో సమంత.. ప్రమోషన్స్ షురూ..
తాజాగా సమంత, చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నేడు ఉదయం సమంత, నటుడు దేవ్ మోహన్, దర్శకుడు గుణ శేఖర్, నిర్మాత నీలిమ గుణ కలిసి హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని...............

Samantha : సమంత మాయోసైటిస్ నుంచి కోలుకొని ఇటీవలే కంబ్యాక్ ఇచ్చింది. వరుసగా సినిమా షూటింగ్స్ లో, ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ ఖుషి సినిమా, బాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ షూటింగ్స్ లో బిజీగా ఉంది. మరోపక్క సమంత మెయిన్ లీడ్ లో నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఇటీవలే శాకుంతలం సినిమా ఫస్ట్ కాపీ పూర్తవడంతో సమంత చిత్రయూనిట్ తో ఆ సినిమాని చూశానని, సినిమా చాలా బాగా వచ్చిందని పోస్ట్ పెట్టింది.
సమంత మెయిన్ లీడ్ లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన శాకుంతలం సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. త్వరలో ఏప్రిల్ 14న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు ఆర్హ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా సమంత, చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. నేడు ఉదయం సమంత, నటుడు దేవ్ మోహన్, దర్శకుడు గుణ శేఖర్, నిర్మాత నీలిమ గుణ కలిసి హైదరాబాద్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి సారె సమర్పించారు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమ్మ గుడి నుంచి సమంత, చిత్రయూనిట్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ఇక సమంత అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
🫶🏻#Shaakuntalam on April 14th!!
The little girl in me is screaming with joy.. loved Disney films all my life and finally to be a part of something that looks and feels so Disney.. dream come true!!#ShaakuntalamDiaries https://t.co/pkFTxNuPwK— Samantha (@Samanthaprabhu2) March 15, 2023