Samantha : సినిమా చూసేశాను అంటూ సమంత పోస్ట్.. వైరల్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!

స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. తాజాగా ఈ మూవీ ఫైనల్ ప్రింట్ ని దిల్ రాజు, గుణశేఖర్, నీలిమ గుణశేఖర్ తో కలిసి సమంత చూసింది. ఆ ట్వీట్ తో పాటు ఒక ఫోటో కూడా షేర్ చేసింది. ఆ ఫొటో బ్యాక్ గ్రౌండ్ లో అల్లు అర్జున్..

Samantha : సినిమా చూసేశాను అంటూ సమంత పోస్ట్.. వైరల్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!

Samantha watch final print of Shaakuntalam movie and it is released in april 14

Samantha : స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ లీడ్ లో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మైథలాజికల్ డ్రామాగా వస్తుంది. హిందూ పురాణాల్లోని ‘శకుంతల’ కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. గుణశేఖర్ ఈ సినిమాని నిర్మిస్తూ, డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాకముందు వరకు ఆడియన్స్ లో పెద్ద అంచనాలు లేవు. కానీ ట్రైలర్ రిలీజ్ తరువాత సినిమా పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Samantha : ఖుషీ షూటింగ్ మొదలుపెట్టిన టీం.. ఉమెన్స్ డే రోజు సామ్ కి గ్రాండ్ వెల్కమ్

ఇక ఈ మూవీ ఫిబ్రవరి నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో సేఫ్ రిలీజ్ కోసం చిత్రాన్ని ఏప్రిల్ నెలకి పోస్ట్‌పోన్ చేశారు. ఏప్రిల్ 14న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. తాజాగా ఈ మూవీ ఫైనల్ ప్రింట్ ని దిల్ రాజు, గుణశేఖర్, నీలిమ గుణశేఖర్ తో కలిసి సమంత చూసింది. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. ”ఫైనల్లీ నేను శాకుంతలం చూసేశాను. ఇంత గొప్ప సినిమాలో నన్ను భాగం చేసినందుకు మీకు రుణపడి ఉంటా గుణశేఖర్ గారు. ప్రేక్షకులు ఈ మూవీలోని ఎమోషన్స్ ఫీల్ అయ్యే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నా. థాంక్యూ దిల్ రాజు, నీలిమ. శాకుంతలం నాకు జీవితాంతం గుర్తిండిపోతుంది” అంటూ ట్వీట్ చేసింది.

Samantha : షూటింగ్‌లో సమంతకు తీవ్ర గాయాలు..

ఆ ట్వీట్ తో పాటు ఒక ఫోటో కూడా షేర్ చేసింది. ఆ ఫొటో బ్యాక్ గ్రౌండ్ లో అల్లు అర్జున్ కూతురు అర్హ కీరిటం పెట్టుకొని సమంతతో కలిసి సింహాసనం పై కూర్చొని కనిపిస్తుంది. దీంతో ఆ ఫోటోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో అల్లు అర్హ ప్రిన్స్ ‘భారత’ పాత్రలో నటిస్తుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ మేల్ లీడ్ చేస్తుండగా.. మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.