Samantha : ఆ సిరీస్ లో ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత.. నిజమేనా? సమంత ఏమంది?

సమంత నటిస్తున్న సిటాడెల్ సిరీస్ హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ కి ప్రీక్వెల్ అని, ఇందులో సమంత ప్రియాంక చోప్రాకు తల్లిగా కనిపించబోతుంది సమాచారం.

Samantha : ఆ సిరీస్ లో ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత.. నిజమేనా? సమంత ఏమంది?

Samantha will play priyanka chopra mother character in citadel rumors goes viral

Priyanka Chopra :  సమంత(Samantha) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. బాలీవుడ్(Bollywood) లో వరుణ్ ధావన్(Varun Dhawan) తో కలిసి సిటాడెల్(Citadel) అనే సిరీస్ కూడా చేస్తోన్న సంగతి తెలిసిందే. హాలీవుడ్(Hollywood) లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ సిరీస్ కు ఇండియన్ వర్షన్ అని చెప్తూ వస్తున్నారు సిరీస్ యూనిట్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా సమంత ఈ సిరీస్ గురించి మాట్లాడిన విషయం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

సమంత నటిస్తున్న సిటాడెల్ సిరీస్ హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ కి ప్రీక్వెల్ అని, ఇందులో సమంత ప్రియాంక చోప్రాకు తల్లిగా కనిపించబోతుంది సమాచారం. ఇటీవల సమంత మీడియాతో మాట్లాడుతూ సిటాడెల్ సిరీస్ లో నాదియా సిన్హ కు తల్లిగా నటిస్తున్నాను అని తెలిపింది. హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ లో ప్రియాంక క్యారెక్టర్ పేరు నాదియా సిన్హ. అలాగే ఈ సిటాడెల్ సిరీస్ హాలీవుడ్ సిరీస్ కి ప్రీక్వెల్ అని చెప్పడంతో సమంత ప్రియాంక చోప్రా చిన్నప్పటి క్యారెక్టర్ కు తల్లిగా కనిపించబోతుందని సమాచారం.

Anushka Sharma : ఇకపై సంవత్సరానికి ఒక సినిమానే చేస్తా.. వాళ్ళ కోసమే ఈ నిర్ణయం..

అయితే ఇందులో సమంత, ప్రియాంకచోప్రా కలిసి నటించే అవకాశం లేదు. ప్రియాంక చోప్రా చిన్నప్పటి క్యారెక్టర్ లో ఎవరైనా చైల్డ్ ఆర్టిస్ట్ ని తీసుకుంటారు. దీంతో ఇలా సిటాడెల్ సిరీస్ లో ప్రియాంక చోప్రా క్యారెక్టర్ కు సమంత తల్లిగా నటించనుంది. అయితే హాలీవుడ్ సిరీస్ లో ఎక్కడా కూడా సమంత క్యారెక్టర్ ప్రియాంక చోప్రా క్యారెక్టర్ కు తల్లి అని చెప్పలేదు. మరి దీనిపై పూర్తిగా క్లారిటీ రావాలంటే సిరీస్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఈ సిరీస్ లో సమంత ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ చేయబోతుంది.