Naga Chaitanya-Samantha: చైతూ జ్ఞాపకాలను తుడిచేస్తున్న సామ్!

తన కసినో, కోపాన్నో, బాధనో.. ఏదైతేనేం అన్నింటికి చెక్ పెట్టేస్తోంది సమంత. విడాకుల తర్వాత ఒక్కొక్కటిగా నాగచైతన్యకు సంబంధించిన అటాచ్ మెంట్స్ ను వదలించుకుంటుంది. ఎమోషనల్ స్టేటస్ లు..

Naga Chaitanya-Samantha: చైతూ జ్ఞాపకాలను తుడిచేస్తున్న సామ్!

Naga Chaitanya Samantha

Naga Chaitanya-Samantha: తన కసినో, కోపాన్నో, బాధనో.. ఏదైతేనేం అన్నింటికి చెక్ పెట్టేస్తోంది సమంత. విడాకుల తర్వాత ఒక్కొక్కటిగా నాగచైతన్యకు సంబంధించిన అటాచ్ మెంట్స్ ను వదలించుకుంటుంది. ఎమోషనల్ స్టేటస్ లు.. మోటివేషనల్ మెసేజ్ లు.. ఆథ్యాత్మిక యాత్రలు.. వీటితోనే కాదు పాత జ్ఞాపకాలకు పూర్తిగా బైబై చెప్పేసి రిలాక్స్ అవాలనుకుంటోంది.

Samantha : చైతూని తప్ప అక్కినేని ఫ్యామిలీ అందర్నీ ఫాలో అవుతున్న సమంత

నాగచైతన్య నుంచి పూర్తిగా దూరం కావాలనుకుంటుంది సమంతా. తన జ్ఞాపకాలతో డిస్ట్రబ్ కాకుండా జాగ్రత్తపడుతున్నారు. అందులో బాగంగానే లేటెస్ట్ గా ఇన్స్ టా అకౌంట్ లో చైతూను అన్ ఫాలో చేసింది. విడాకుల ప్రకటన తర్వాత చై ఫోటోలను డిలీట్ చేసి ఆయన ట్విట్టర్ అకౌంట్ ను అన్ ఫాలో చేసిన సామ్.. ఇప్పుడిలాంటి ట్విస్ట్ ఇచ్చింది.

Samantha : డ్రెస్సింగ్ స్టైల్‌పై వచ్చిన ట్రోల్స్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సమంత

ఈమధ్యే పెళ్లి సమయంలో చైతూ ప్రెజెంట్ చేసిన తన అమ్మమ్మ చీరను కూడా సామ్ తిరిగి ఇచట్చేసినట్టు గాసిప్స్ వినిపించాయి. సో పర్సనల్ గా చైతో ఎలాంటి అటాచ్ మెంట్స్ లేకుండా జాగ్రత్తపడుతున్న సమంత.. సోషల్ అకౌంట్స్ లోనూ చై కనిపించకుండా చూసుకుంటుంది. అయితే నాగచైతన్య మాత్రం ఇంకా ఇన్స్ టాలో సమంతాను ఫాలో అవుతున్నాడు. అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలి నుంచి కొంతమందిని ఫాలో అవుతున్న సామ్.. చైతన్య ఒక్కడినే ఆ లిస్ట్ నుంచి తీసేసింది.

Samantha: సామ్ F**K టీ షర్ట్.. సోషల్ మీడియా రచ్చ రచ్చ!

విడాకుల తర్వాత నాగచైతన్య సైలంటయిపోయాడు. ఎక్కడా సామ్ టాపిక్ తీసుకురాలేదు. కోపాన్ని, బాధను ప్రదర్శించలేదు. తను ఇంట్రోవర్ట్ టైప్. కానీ సమంత అలా కాదు. కోపాన్ని తెలియజేసేలా పోస్ట్ లు చేసింది. బాధను మరిచిపోయేలా డివోషనల్ టూర్స్,.. ఫ్రెండ్స్ తో ట్రిప్స్ వేసింది. ప్రొఫెషనల్ గా తనకున్న స్టామినాను వరుస సినిమాల కమిట్ మెంట్స్ తో ప్రూవ్ చేసింది. పుష్ప ఐటమ్ సాంగ్ తో నేషనల్ వైడ్ రచ్చ చేసింది. ఇప్పుడిలా.. ఇన్ని నెలల తర్వాత చైకి సంబధించిన ఎలాంటి జ్ఞాపకాలు తనకు అవసరం లేదన్నట్టు బిహేవ్ చేస్తుంది.