Samantha: యశోద.. ఆ రోజున రాదా..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఆమె పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే......

Samantha: యశోద.. ఆ రోజున రాదా..?

Samantha Yashoda Movie Release To Be Postponed

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఆమె పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసింది సామ్. ఈ సినిమాతో పాటు మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’లో కూడా సమంత నటిస్తోంది. ఈ సినిమాను హరి-హరీశ్‌లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉంటుందని, ఈ సినిమా ఆడియెన్స్‌ను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.

Samantha : సమంత కేవలం దానివల్లే నెలకు మూడు కొట్లు సంపాదిస్తుంది..

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. సై-ఫై థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో మహిళా ఖైదీగా సమంత నటించనుంది. ఈ సినిమా కథనం ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో మార్పులు జరుగుతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Yashoda : ప్రెగ్నెంట్ ఉమెన్ క్యారెక్టర్‌లో సమంత

యశోద చిత్రాన్ని ముందుగా అనుకున్నట్లుగా ఆగస్టు 12న రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో సమంత ముఖ్య పాత్రలో నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేశ్, ఉన్ని ముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి యశోద సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.