Kiran Abbavaram : సమ్మతమే కథ ఇదేనా?? | Sammathame story revealed by kiran abbavaram

Kiran Abbavaram : సమ్మతమే కథ ఇదేనా??

కిరణ్ అబ్బవరం ఈ సినిమా కథ గురించి హింట్ ఇస్తూ.. ''ట్రైలర్ ఓపెనింగ్‌లో ఒక డైలాగ్ వుంటుంది. ఇంటికి మహాలక్షి ఆడపిల్ల. ఆ ఆడపిల్ల లేని ఇల్లు బోసిపోయి వుంటుంది. ఇందులో కథానాయకుడి పేరు కృష్ణ. అతని .....................

Kiran Abbavaram : సమ్మతమే కథ ఇదేనా??

Sammathame :  యువ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా గోపినాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సమ్మతమే. జూన్ 24న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ఫుల్ జోష్ లో చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరో కిరణ్ సబ్బవరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

కిరణ్ అబ్బవరం ఈ సినిమా కథ గురించి హింట్ ఇస్తూ.. ”ట్రైలర్ ఓపెనింగ్‌లో ఒక డైలాగ్ వుంటుంది. ఇంటికి మహాలక్షి ఆడపిల్ల. ఆ ఆడపిల్ల లేని ఇల్లు బోసిపోయి వుంటుంది. ఇందులో కథానాయకుడి పేరు కృష్ణ. అతని తల్లి చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ఇంటికి మళ్ళీ ఆడపిల్ల వస్తే కళ వస్తుంది అని నమ్ముతాడు. అందుకే చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావని వాళ్ళ నాన్నని అడుగుతాడు. పెళ్లిపై అంత మంచి ఒపీనియన్ ఉన్న హీరోకి పెళ్లిచూపుల్లో ఎలాంటి అమ్మాయి ఎదురైంది? ఒక మధ్యతరగతి కుర్రాడు సిటీ నేపథ్యం ఉన్న అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే అంశాలతో ఎంటర్టైన్మెంట్ రూపంలో తెరకెక్కించాం” అని తెలిపాడు.

UnStoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ.. అధికారికంగా ప్రకటించిన ఆహా..

ఇక సినిమా యూనిట్ గురించి మాట్లాడుతూ..” హీరోయిన్ ని సెలెక్ట్ చేయడానికి చాలా రోజులు తీసుకున్నాం. చివరికి చాందినిని ఓకే చేశాం. ఒక మంచి తెలుగు ఫీల్ ఉన్న సినిమా కావడంతో తెలుగు అమ్మాయిని తీసుకోవాలని చాందిని చౌదరిని తీసుకున్నాము. ఇక దర్శకుడు గోపినాథ్, నాకు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నప్పటి నుంచి తెలుసు. నా మొదటి సినిమా రాజా వారు రాణి గారు సినిమా రిలీజ్ అయినప్పుడే ఈ కథ ఓకే చేసేశాం” అని తెలిపారు.

×