Sammathame: ‘బావ తాకితే’.. సత్యభామ సిగ్గుపడకుండా ఉండగలదా?!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం ఢిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ మూవీ ‘రాజా వారు రాణి గారు’ రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. రెండో చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఆ రెండూ కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి.

Sammathame: ‘బావ తాకితే’.. సత్యభామ సిగ్గుపడకుండా ఉండగలదా?!

Sammathame

Sammathame: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం ఢిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ మూవీ ‘రాజా వారు రాణి గారు’ రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. రెండో చిత్రం ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఆ రెండూ కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్‌డ్రాప్‌తో రాబోతోన్నాడు.

Sammathame: మేరేలియే ప్యార్ నహీ ఆతా.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా సమ్మతమే టీజర్!

టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌, ఫస్ట్ గ్లింప్స్‌, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా రెండు పాటలు అంతకు మించిన రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. ‘బావ తాకితే’ అనే యూనిక్ స్టైల్ రెట్రో సాంగ్ లిరికల్ వీడియోని మే 21న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఈ పోస్టర్ ఈ సాంగ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది.

Sammathame : ఈ వలపు మలుపుల్లో సతమతము ‘సమ్మతమే’..

ఇక పోస్టర్ చూస్తే చాందిని చౌదరీ సిగ్గు పడుతూ ఊయలలో కూర్చొని ఉండగా.. కిరణ్ అబ్బవరం వెనుక నిలబడి నవ్వుతూ ఆమె వైపే తీక్షణంగా చూస్తున్నాడు. ఇద్దరూ రెట్రో లుక్ లో ఆకట్టుకుంటున్నారు. మరి ‘బావ తాకితే’ పాట ఆడియన్స్ ను ఎలా అలరిస్తుందో కానీ.. పోస్టర్ చూస్తే మాత్రం బావ తాకితే మరదలు సమ్మతమే అన్నట్లుగా డిజైన్ మాత్రం భలే అనిపిస్తుంది. 2022 జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తుండగా కిరణ్, చాందినిలకు సమాంతమే ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.