Samyuktha Menon : అసలు పట్టించుకోరా? విరూపాక్ష టీంపై ట్విట్టర్ లో ఫైర్ అయిన సంయుక్త.. సారీ చెప్పిన చిత్రయూనిట్..

యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజయిన ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇప్పటివరకు సంయుక్తని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్క పోస్టర్ కూడా రిలిజ్ చేయలేదు................

Samyuktha Menon : అసలు పట్టించుకోరా? విరూపాక్ష టీంపై ట్విట్టర్ లో ఫైర్ అయిన సంయుక్త.. సారీ చెప్పిన చిత్రయూనిట్..

Samyuktha Menon fires on Virupaksha Team in Twitter goes viral

Samyuktha Menon :  భీమ్లా నాయక్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ సంయుక్త మీనన్. ఆ తర్వాత బింబిసార, సార్ సినిమాలతో కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టింది. తెలుగులో వరుస హిట్స్ సాధించడంతో సంయుక్తకు వరుస అవకాశాలు వస్తున్నాయి టాలీవుడ్ లో. ప్రస్తుతం సంయుక్త సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమాలో నటిస్తుంది.

యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజయిన ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇందులో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇప్పటివరకు సంయుక్తని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్క పోస్టర్ కూడా రిలిజ్ చేయలేదు చిత్రయూనిట్. ఉగాదికి రిలీజ్ చేస్తామని చేయకపోవడంతో సంయుక్త ఫీల్ అయి ట్విట్టర్ లో చిత్రయూనిట్ పై, నిర్మాణ సంస్థపై ఫైర్ అయింది.

సంయుక్త తన ట్విట్టర్ లో.. విరూపాక్ష సినిమాతో నా జర్నీ చాలా అద్భుతమైనది. అలాంటి టెక్నీషియన్స్, నటులతో పనిచేయడం నాకు నిజంగానే గౌరవం. కానీ నేను నిరాశ చెందాను. చిత్ర నిర్మాణ సంస్థ ఎందుకు అంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. నా క్యారెక్టర్ పోస్టర్ ఉగాదికి రిలీజ్ చేస్తారని అన్నారు? ఏది? అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసి అందరూ షాక్ అయ్యారు. హీరోయిన్ ఇలా అడిగేసిందేంటి పబ్లిక్ గా అని ఆశ్చర్యపోతున్నారు.

Koratala Siva : ఆచార్య తర్వాత ఇన్నాళ్లకు మీడియా ముందుకు.. NTR 30 ఓపెనింగ్ లో కొరటాల శివ ఏం మాట్లాడాడో తెలుసా?

అయితే సంయుక్త చేసిన ఈ ట్వీట్ కి చిత్ర నిర్మాణ సంస్థ.. సారీ చెప్తున్నాము. మాకు కొంచెం టైం ఇవ్వండి, రిలీజ్ చేస్తాము అని అనగా సంయుక్త ఓకే చెప్పింది. ఇక ఇదే ట్వీట్ కి హీరో సాయి ధరమ్ తేజ్ కూడా రిప్లై ఇస్తూ.. మా లక్కీ చామ్ ని మేము ఇంట్రడ్యూస్ చేయడం ఎలా మిస్ చేస్తాం. మేము పెద్ద బ్యాంగ్ తో పరిచయం చేయడానికి ఎదురుచూస్తున్నాము అని పోస్ట్ చేశాడు. సంయుక్త ఇలా అడిగేసరికి ఒక నెటిజన్ విరూపాక్ష సాయిధరమ్ తేజ్ పోస్టర్ లో సాయి ధరమ్ తేజ్ ఫోటో తీసేసి సంయుక్త ఫోటో ఒకటి పెట్టి పోస్ట్ చేయడంతో.. సంయుక్త నవ్వేసింది.