నువ్వు వర్జిన్‌వేనా? నెటిజన్ ప్రశ్నకు ఫైర్ అయిన హీరోయిన్

మలయాళీ నటి సంయుక్త మీనన్ తనను అభ్యంతరకరంగా ప్రశ్నించిన ఓ ఆకతాయిపై ఫైర్ అయింది..

  • Edited By: sekhar , April 3, 2020 / 02:25 PM IST
నువ్వు వర్జిన్‌వేనా? నెటిజన్ ప్రశ్నకు ఫైర్ అయిన హీరోయిన్

మలయాళీ నటి సంయుక్త మీనన్ తనను అభ్యంతరకరంగా ప్రశ్నించిన ఓ ఆకతాయిపై ఫైర్ అయింది..

సినిమా స్టార్స్ అంటే ఒకప్పుడు క్రేజ్ మామూలుగా ఉండేది కాదు.. వాళ్లు కనబడితే ఆటోగ్రాఫులు, ఫోటోగ్రాఫులు ఆ హంగామానే వేరుగా ఉండేది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యులకు, సెలబ్రిటీలకు మధ్య దూరం తగ్గిపోయింది. సినీ ప్రముఖులు నేరుగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడుతున్నారు. తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్‌డేట్స్ తెలుపుతూ తమ ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు లైవ్‌లో సమాధానాలు చెబుతున్నారు.

అయితే సినిమా వాళ్లు అందులోనూ కథానాయికలను కొందరు ఆకతాయిలు అనవసరపు ప్రశ్నలతో విసిగించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్‌కు ఓ నెటిజన్ ప్రశ్న చిరాకు తెప్పించింది. చిర్రెత్తుకొచ్చిన సంయుక్త ఘాటుగా రిప్లై ఇచ్చింది. ‘నువ్వు వర్జిన్‌వేనా?’ అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా సంయుక్తను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సంయుక్త ఫైర్ అయింది.

Samyuktha Menon slams netizen for Virginity remarks

‘నీలాంటి ఆకతాయిలకు అమ్మాయిలు ఆటబొమ్మల్లా కనిపిస్తుంటారు. మీలాంటి వాళ్లు ఎప్పుడూ సెక్స్, ఆల్కహాల్ గురించే ఆలోచిస్తారు. మీలాంటి వాళ్లు ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండు.. నీ చెంప పగలగొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంద’ని సంయుక్త ఆ ఆకతాయిపై ఫైర్ అయింది. ప్రస్తుతం మలయాళంలో జయసూర్య పక్కన ‘వెల్లం : ది ఎసెన్షియల్ డ్రింక్’ (Vellam: The Essential Drink) సినిమాలో కథానాయికగా నటిస్తోంది సంయుక్త మీనన్.

Read Also : పెళ్లికి బాజా మోగింది.. ధూం! ధాం! గా బారాత్