Sandeep Vanga : పుష్పలో ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగాకు నచ్చిన సీన్ ఇదే!

అర్జున్ రెడ్డిలో కూడా లవ్ లోని రొమాన్స్ ను సందీప్ రెడ్డి ఎంత బాగా చూపించాడో వేరే చెప్పనక్కర్లేదుగా..!

Sandeep Vanga : పుష్పలో ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ వంగాకు నచ్చిన సీన్ ఇదే!

Sandeep Reddy Vanga

Sandeep Vanga : అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో ల్యాండ్ మార్క్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చిన ఈ మూవీ.. తెలుగు సినీ పరిశ్రమలో తీసుకొచ్చిన వెండితెర కంపం మామూలుది కాదు. ఈ సినిమా తర్వాత.. సినిమా చూసే, సినిమా తీసే విషయంలో జనం, మేకర్స్ యాటిట్యూడే మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. అదే కథను హిందీలోనూ తీసి.. షాహిద్ కపూర్‌కు కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు సందీప్. అలాంటి కల్ట్-క్లాసిక్-రా మెటీరియలిస్టిక్ డైరెక్టర్ సందీప్ వంగా.. రీసెంట్ గా వచ్చిన కల్ట్-స్మగ్లింగ్-యాక్షన్-ఎంటర్ టైనర్ ‘పుష్ప’ సినిమాలో ఓ సన్నివేశానికి ఫిదా అయిపోయాడు. ఆ సీన్ ఏంటనే ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది.

Read This : Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..

పుష్ప ప్రమోషన్ లోనూ సందీప్ వంగా పాల్గొంటున్నాడు. రీసెంట్ గా జరిగిన ‘పుష్ప సక్సెస్ పార్టీ’లో తన ఒపీనియన్ ను షేర్ చేసుకున్నాడు. సందీప్ వంగా ఈ సీన్ నచ్చిందని చెప్పిన విషయాన్ని మర్నాడు ‘థాంక్స్ మీట్’లో అల్లు అర్జున్ కూడా ఈ అంశాన్ని వేదికపై ప్రస్తావించారు.

Read This : Sukumar-Trivikram : ఆనాడు త్రివిక్రమ్.. ఇప్పుడు సుకుమార్.. సీన్లు అద్భుతం..!

ఆ సీన్ ఏంటంటే..?
ప్రేమ,క్రైం, స్మగ్లింగ్ అంశాలతో పుష్ప సినిమాను ‘పచ్చి’గా తీశాడు డైరెక్టర్ సుకుమార్. రంగస్థలం లాగే.. ఈ మూవీలో ఆయన టేకింగ్, మేకింగ్, ప్లానింగ్ కు మంచి అప్లాజ్ వచ్చింది. రష్మికతో అల్లు అర్జున్ ప్రేమ సన్నివేశాలు కూడా పచ్చిగా ఉంటాయి. ఒకానొక దశలో ఈ ప్రేమ-రొమాన్స్ చూసే ప్రేక్షకులకు షాకిచ్చేసింది కూడా. వ్యాన్ లో రష్మిక భుజంపై చేయి వేసి అల్లు అర్జున్ చేసే రొమాంటిక్ సీన్ కుర్రకారుకే మతులు పోగొట్టింది. ఇంత పచ్చిగా రొమాన్స్ సీన్ ఎలా పెట్టాడ్రా బాబూ అని కూడా చాలామంది అనుకున్నారు. రష్మిక చెయ్ తీయమనడం.. తాను అలిగి తీసేయడం.. అలిగాడని.. రష్మిక మళ్లీ చేయి భుజంపై వేసుకోవడం.. ఇదంతా.. ఓ అల్లరి ప్రేమ ఎపిసోడ్ గా చిత్రీకరించారు. స్క్రీన్‌పై అసభ్యత కనిపించదు కానీ.. రష్మిక-అల్లు అర్జున్ మాటలతోనే ఆ సీన్ అంతా మనకు కనిపించేలా చేశాడు డైరెక్టర్. ఈ పచ్చి రొమాంటిక్ సీన్ సందీప్ వంగాకు బాగా నచ్చిందట. ఈ సీన్ తీయాలంటే చాలా డేర్ కావాలి.. అంటూ సుకుమార్‌ను, రష్మిక, అల్లు అర్జున్ ను మెచ్చుకున్నారు సందీప్ రెడ్డి.

అర్జున్ రెడ్డిలో కూడా లవ్ లోని రొమాన్స్ ను సందీప్ రెడ్డి ఎంత బాగా చూపించాడో వేరే చెప్పనక్కర్లేదుగా..!

Read This : Sukumar : సీన్ అదుర్స్..! చంద్రబోస్ కాళ్లు మొక్కిన సుకుమార్