Thalapathy 67 : విజయ్‌ని ఢీ కొట్టేందుకు దిగుతున్న సంజు భాయ్..
వరుస సక్సెస్ లు అందుకుంటున్న విజయ్ తన తదుపరి సినిమా పనులు మొదలు పెట్టేశాడు. దళపతి 67వ సినిమాగా వస్తున్న ఈ మూవీని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

Thalapathy 67
Thalapathy 67 : ఇళయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘వరిసు’. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఎంటర్‍టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి సంక్రాంతి బరిలో విన్నర్ గా నిలిచింది. వరుస సక్సెస్ లు అందుకుంటున్న విజయ్ తన తదుపరి సినిమా పనులు మొదలు పెట్టేశాడు. దళపతి 67వ సినిమాగా వస్తున్న ఈ మూవీని లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
Thalapathy 67: అఫీషియల్.. విజయ్‌తో చేతులు కలిపిన లోకేశ్..!
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మాస్టర్’ సినిమా ఎంతటి హిట్ అయ్యిందో అందరి తెలుసు. 2021లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దీంతో వీరిద్దరి కలయికలో మరో సినిమా కోసం అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక మూవీ ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మాస్టర్ సినిమాలో విజయ్ ని ఢీ కొట్టే పాత్రలో విజయ్ సేతుపతి నటించి మూవీకే హైలైట్ గా నిలిచాడు. దీంతో ఇప్పుడు ఈ చిత్రంలో విలన్ గా ఎవరు నటించబోతున్నారు అంటూ అందిరిలో ఆసక్తి నెలకుంది.
అయితే ఈసారి విజయ్ ని ఢీ కొట్టేందుకు లోకేష్ కేజీఎఫ్ విలన్ ని రంగంలోకి దించుతున్నాడు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కేజీఎఫ్ సినిమాలో విలన్ గా అదరగొట్టేశాడు. దీంతో సౌత్ లోని చాలా సినిమాలో సంజయ్ విలన్ పాత్రలకు సైన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ సినిమాకి కూడా ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సంజయ్ దత్ పోస్టర్ షేర్ చేశారు. ఆ పోస్టర్‌లో.. ‘సినిమా కథ విన్నాక ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ లో పాల్గొందామా అని ఎదురు చూస్తున్నా’ అంటూ సంజయ్ దత్ సినిమా గురించి మాట్లాడిన మాటలు ప్రింట్ చేశారు. కాగా ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది.
We feel esteemed to welcome @duttsanjay sir to Tamil Cinema and we are happy to announce that he is a part of #Thalapathy67 ❤️#Thalapathy67Cast #Thalapathy @actorvijay sir @Dir_Lokesh @Jagadishbliss pic.twitter.com/EcCtLMBgJj
— Seven Screen Studio (@7screenstudio) January 31, 2023