Sanjay Dutt : హీరో నుంచి క్రూరమైన విలన్‌గా మారిన సంజు..

ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు సంజయ్ దత్. ఆ తర్వాత పలు కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చి కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ని విలన్ గా.............

Sanjay Dutt : హీరో నుంచి క్రూరమైన విలన్‌గా మారిన సంజు..

Sanjay Dutt

Sanjay Dutt :  ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు సంజయ్ దత్. ఆ తర్వాత పలు కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చి కొన్నాళ్ళు సినిమాలకి దూరంగా ఉన్నారు. ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ ని విలన్ గా మొదలుపెట్టి ఇప్పుడు విధ్వసం సృష్టించే విలన్ పాత్రలో సంజయ్ దత్ ఒదిగిపోయి నటిస్తున్నాడు. నాయకుడికి ధీటైన ప్రతినాయుకుడిగా అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తూ స్టార్ హీరోలకొచ్చిన క్రేజూ, ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు.

సంజయ్ దత్ అద్భుతమైన ప్రతినాయకుడు అనడానికి ముసాఫిర్, అగ్నీపథ్, పానిపట్, కేజిఎఫ్ 2, ఇప్పుడు షంషేరా నిరూపిస్తున్నాయి. సంజయ్ దత్ బయోపిక్ లో సంజు పాత్ర పోషించిన రణబీర్ కపూర్ సినిమా షంషేరాలో ఇంతకు ముందెప్పుడు చూడని అవతారంలో డరోగా సుద్ సింగ్ క్యారెక్ట్ చేయబోతున్నాడు సంజయ్ దత్. జులై 22న రిలీజ్ కానున్న షంషేరా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా షంషేరా. పీరియాడికల్ మూవీగా వస్తోన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన వాణి కపూర్ నటిస్తుంది. ప్రతినాయకుడిగా సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. విలన్ పాత్రలో తనను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు సంజయ్ దత్.

Sreeleela : ఒక్క సినిమాతో వరుస ఛాన్సులు కొట్టేస్తున్న శ్రీలీల..

Sanjay

 

కేజిఎఫ్ 2లో అధీరాగా రాఖీభాయ్ కి ధీటైన నటనను ప్రదర్శించి విధ్వంసమే సృష్టించాడు. షంషేరాలో రణబీర్ కపూర్ తో తలపడనున్నాడు 62 ఏళ్ల సంజయ్ దత్. ట్రయిలర్ లోనే తన మార్క్ పెర్ఫామెన్స్ తో బెంబేలెత్తిస్తున్నాడు. సంజయ్ దత్ 2004లోనే ముసాఫిర్ సినిమాతోనే గ్యాంగ్ స్టర్ గా నెగటివ్ రోల్ పోషించి సక్సెస్ అయ్యాడు. ముసాఫిర్ లో హీరోగా అనిల్ కపూర్ నటించాడు. ఆ తర్వాత 2012లో అగ్నిపథ్ సినిమాలో డిఫరెంట్ మేకోవర్ తో హడలెత్తించాడు. ఆతర్వాత 2019లో వచ్చిన పానిపట్ హిస్టారికల్ మూవీలో అహ్మద్ షా అబ్దాలిగా ప్రతినాయకుడి పాత్రలో మెప్పించాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా సంజు పాత్రకి పేరొచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కేజిఎఫ్ 2 సినిమా భారీ విజయం సాధించి అధీరగా సంజయ్ దత్ కి మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు షంషేరాలో సిద్ సింగ్ క్యారెక్టర్ తో మరోసారి సూపర్ విలన్ అనిపించుకుంటున్నాడు సంజయ్ దత్. దీంతో పాన్ ఇండియాకి మంచి విలన్ దొరికారు అని అనుకుంటున్నారు సినిమా వర్గాలు. మరిన్ని విలన్ ఆఫర్స్ సంజయ్ ముందు బారులు తీరుతున్నాయట.