Leo Movie : ‘లియో’ సెట్స్ లోకి ఎంటర్ అయిన సంజయ్ దత్త్..
గతంలో మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ తో మరోసారి విజయ్ జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'లియో' అనే టైటిల్ ని కూడా పెట్టారు. ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్త్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టుకున్న ఈ మూవీ సెట్స్ లోకి..

Sanjay Dutt joins the vijay leo movie shooting
Leo Movie : తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఈ ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ మూవీని సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక కొంత కాలంగా ఏడాదికి ఒక సినిమా మాత్రమే రిలీజ్ చేస్తున్న విజయ్.. ఈ ఏడాది రెండు సినిమాలతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. గతంలో మాస్టర్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ తో మరోసారి విజయ్ జత కట్టబోతున్న సంగతి తెలిసిందే.
Leo Movie: విజయ్ ‘లియో’ మూవీకి కళ్లు చెదిరే ఆఫర్.. కానీ పట్టించుకోని లోకేశ్!
ఈ చిత్రానికి ‘లియో’ అనే టైటిల్ ని కూడా పెట్టారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలు పెట్టుకున్న చిత్ర యూనిట్.. టైటిల్ అనౌన్స్‌మెంట్ కి రిలీజ్ చేసిన వీడియో మూవీ పై ఆడియన్స్ లో విపిరితమైన క్యూరియోసిటీని పెంచేసింది. కాగా ఈ సినిమాలో విలన్ గా సంజయ్ దత్త్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ సెట్స్ లోకి సంజయ్ దత్త్ అడుగుపెట్టాడు. మూవీ టీం సంజయ్ కి గ్రాండ్ వెల్కమ్ పలికింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. గ్యాంగ్ స్టార్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కానున్నట్లు తెలుస్తుంది.
లోకేష్ కనగరాజ్ తన గత సినిమాలు విక్రమ్ అండ్ ఖైదీని లింక్ చేస్తూ తన సినిమాటిక్ యూనివర్స్ కి తెరలేపాడు. ఇక విక్రమ్ మూవీలో విలన్ గా కనిపించిన విజయ్ సేతుపతి ఈ మూవీలో కనిపించబోతున్నాడు అంటూ లియో రచయిత రత్నకుమార్ ఇటీవల హింట్ ఇచ్చాడు. మరి ఈ సినిమాలో ఇంకెంత మంది స్టార్స్ కనిపించబోతున్నారో చూడాలి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
VIJAY – LOKESH KANAGARAJ: SANJAY DUTT TO PARTICIPATE FOR ‘LEO’ SHOOT… Team #Leo welcomes #SanjayDutt at the location shoot.#Vijay #LokeshKanagaraj #SevenScreenStudio pic.twitter.com/M6bvktN3LX
— taran adarsh (@taran_adarsh) March 11, 2023