సంజూ భాయ్‌తో రాకీ భాయ్‌

కె.జి.ఎఫ్. చాప్టర్-2 లో సంజయ్ దత్.

  • Published By: sekhar ,Published On : February 7, 2019 / 01:40 PM IST
సంజూ భాయ్‌తో రాకీ భాయ్‌

కె.జి.ఎఫ్. చాప్టర్-2 లో సంజయ్ దత్.

కన్నడ రాక్ స్టార్ యశ్, కె.జి.ఎఫ్.తో ఒక రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. కన్నడ సినిమా స్థాయి పెంచిన సినిమా ఇది. డిసెంబర్ 21న కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో భారీగా రిలీజ్ అయ్యి, 40 రోజులు దాటినా, ఇప్పటికీ మంచి కలెక్షన్స్‌తో రన్ అవుతుందీ సినిమా. లాస్ట్ వీక్ అమెరికాలో రీ-రిలీజ్ అయ్యింది.. ఫిబ్రవరి 8తో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకోబుతున్న కె.జి.ఎఫ్. చాప్టర్-1, ఫిబ్రవరి 5నుండి అమెజాన్‌ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతండగా, జనాలు విపరీతంగా చూస్తున్నారు. ఇప్పటినుండే చాప్టర్-2 పై అంచనాలు పెరిగిపోయాయి.

కె.జి.ఎఫ్. చాప్టర్-2 గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటించనున్నాడని తెలుస్తుంది. చాప్టర్-2లో సంజూ భాయ్ ఓ ఇంపార్టెంట్ రోల్ చెయ్యబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే మూవీ యూనిట్ సంజయ్‌ని కలిసి మాట్లాడినట్టు తెలుస్తుంది. అదే నిజమైతే రాకీ భాయ్‌తో సంజూ భాయ్ కలిసి కనిపిస్తే రచ్చ మామూలుగా ఉండదు మరి. 2020లో కె.జి.ఎఫ్. చాప్టర్-2 రిలీజ్ చెయ్యనున్నారు.