Sanjjanaa Galrani : మరోసారి శ్రీమంతం చేసుకున్న హీరోయిన్..

రెండో సారి శ్రీమంతం చేసుకున్న సంజనా ఆ కార్యక్రమం ఫోటోలు షేర్ చేసి, తన భర్తని ఉద్దేశించి.. ''డాక్టర్ సాబ్, నీ లాంటి వాడు నాకు దొరికినందుకు కృతజ్ఞతలు....................

Sanjjanaa Galrani : మరోసారి శ్రీమంతం చేసుకున్న హీరోయిన్..

Sanjjana

Sanjjanaa Galrani :  ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో రెండో హీరోయిన్ గా మెప్పించిన సంజనా గల్రాని తెలుగులో తక్కువ సినిమాలే చేసినా కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గతంలో కన్నడ సినీ పరిశ్రమ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలుకి కూడా వెళ్ళొచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడు డాక్టర్ పాషాని 2021 జనవరిలో వివాహం చేసుకున్న సంజన ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

ఇటీవలే కొంతమంది సంజనా స్నేహితులు ఆమెకి సింపుల్ గా ఇంట్లోనే శ్రీమంతం నిర్వహించారు. దీంతో ఎమోషనల్ అయిన సంజన ఆ శ్రీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి నా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు ఎంతో ప్రేమగా శ్రీమంతం నిర్వహించారు అంటూ పోస్ట్ చేసింది. తాజాగా సంజనా మరోసారి శ్రీమంతం చేసుకుంది. ఈ సారి సంజనా అత్తామామలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలని పోస్ట్ చేసింది.

Nandini Reddy : తన పర్సనల్స్ నేను పట్టించుకోను.. సమంతపై నందినిరెడ్డి వ్యాఖ్యలు..

రెండో సారి శ్రీమంతం చేసుకున్న సంజనా ఆ కార్యక్రమం ఫోటోలు షేర్ చేసి, తన భర్తని ఉద్దేశించి.. ”డాక్టర్ సాబ్, నీ లాంటి వాడు నాకు దొరికినందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నువ్వే నా బలం, నా ఆనందం, నా ఎనర్జీ, నా సర్వసం అన్ని. మనల్ని విడదీయడానికి కొన్ని పరిస్థితులు, కొంతమంది మనుషులు ప్రయత్నించారు. అయినా నువ్వు నాతోనే ఉన్నావు. ఆ దేవుడి ఆశీర్వాదాలు, మన తల్లితండ్రుల ఆశీర్వాదాలు మనకి ఉన్నాయి. ఒక సెలబ్రిటీగా బయటకి వచ్చినప్పుడు పేరు, డబ్బు సంపాదించడానికి కష్టపడుతూనే కుటుంబం కోసం సమయం కేటాయించాలి అని తెలుసుకున్నాను. ఈ ప్రయాణంలో వారే తోడుగా నిలుస్తారు. ఈ బేబీ షవర్ ఈవెంట్ మొత్తం నా అత్తామామలే చేశారు. వారు నాకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటారు. నా కుటుంబం, స్నేహితులకి ధన్యవాదాలు” అని పోస్ట్ చేసింది.

 

అలాగే మరికొన్ని ఫొటోలని షేర్ చేసి.. ”మొదటి సారి నా హిందూ పద్దతిలో శ్రీమంతం చేసుకున్నాను. ఇప్పుడు రెండోసారి నా భర్త వారింటి ప్రకారం ముస్లిం పద్దతిలో శ్రీమంతం చేసుకున్నాను. నా చుట్టాలు, స్నేహితులు దీన్ని గ్రాండ్ గా చేశారు. దాదాపు 300 మంది అతిధులు ఈ ఈవెంట్ కి విచ్చేశారు. స్పెషల్ ఫుడ్ కూడా ఈ ఈవెంట్లో ఉంది. నా బేబీ మరో 20 రోజుల్లో బయటకి రానుంది. కౌంట్ డౌన్ మొదలైంది” అని తెలిపింది.