Sankranthi Heros : ఏ హీరో ఎన్నిసార్లు సంక్రాంతికి వచ్చాడో తెలుసా?? సంక్రాంతి హీరోలు..

సంక్రాంతి వినోదానికి కేరాఫ్ అడ్రెస్. అభిమానుల్లో అన్ లిమిటెడ్ ఆనందాన్ని లోడ్ చేయడానికి హీరోలు ఆ పండగరోజునే తమ సినిమాలతో మరో పండగను సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతారు. కొందరు హీరోలు కొన్నేళ్ళుగా తమ అభిమానుల్ని సంక్రాంతి సీజన్ లో.....................

Sankranthi Heros : ఏ హీరో ఎన్నిసార్లు సంక్రాంతికి వచ్చాడో తెలుసా?? సంక్రాంతి హీరోలు..

sankranthi heros and their sankranthi movies

 

Sankranthi Heros :  సంక్రాంతి వినోదానికి కేరాఫ్ అడ్రెస్. అభిమానుల్లో అన్ లిమిటెడ్ ఆనందాన్ని లోడ్ చేయడానికి హీరోలు ఆ పండగరోజునే తమ సినిమాలతో మరో పండగను సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతారు. కొందరు హీరోలు కొన్నేళ్ళుగా తమ అభిమానుల్ని సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలతో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తే మొత్తం 17 సార్లు సంక్రాంతి సీజన్ లో తన సినిమాలతో ఫ్యాన్స్ కు ఫుల్ మాసీ ఫీస్ట్ అందించారు. వాటిలో ఎక్కువ శాతం మంచి సక్సెస్ సాధించాయి. చిరు హీరో అయ్యాక ఆయన మొట్టమొదటి సంక్రాంతి సినిమా ‘ప్రేమపిచ్చోళ్ళు’. రాధిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 1983 సంక్రాంతి కానుకగా రిలీజై ఫ్లాప్ గా నిలిచింది. 1985లో జనవరి 5న రిలీజైన చట్టంతో పోరాటం మంచి సక్సెస్ సాధించింది. 1986లో రిలీజైన ‘కిరాతకుడు’ మూవీ డిజాస్టర్ గా నిలవగా 1987 జనవరి 9న రిలీజైన దొంగమొగుడు బ్లాక్ బస్టర్ హిట్టైంది. 1988 జనవరి 14న మంచిదొంగ, 1989 జనవరి 14న వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సూపర్ హిట్స్ గా నిలిచాయి. 1991 జనవరి 9న రిలీజైన ‘స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్’ యావరేజ్ గా నిలవగా, 1993 జనవరి 17న రిలీజైన ముఠామేస్త్రి సూపర్ హిట్టైంది. 1994 జనవరి 9న రిలీజైన ముగ్గురు మొనగాళ్ళు కూడా మంచి విజయం సాధించింది. 1997లో వచ్చిన హిట్లర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1999లో రిలీజైన స్నేహం కోసం మంచి హిట్టైంది. 2000 జనవరి 7న రిలీజైన అన్నయ్య సినిమా కూడా సూపర్ హిట్టైంది. 2001జనవరి 11న రిలీజైన మృగరాజు, 2004 జనవరి 14న వచ్చిన అంజి సినిమాలు ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక చిరు కమ్ బ్యాక్ తర్వాత వచ్చిన సంక్రాంతి మూవీ ఖైదీనెంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇక తన కెరీర్ లోనే 17వ సారి 2023 జనవరి 13న ‘వాల్తేరు వీరయ్యతో బరిలోకి దిగిన చిరంజీవి ఈ సారి కూడా మంచి విజయం సాధించాడు.

ఇక నటసింహ బాలకృష్ణ తన కెరీర్ లో మొత్తం 17 సార్లు సంక్రాంతి కానుకగా ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ అందించారు. బాలయ్య కెరీర్ లో మొట్టమొదటి సంక్రాంతి సినిమా భార్గవరాముడు. 1987 జనవరి 14న రిలీజైన ఈసినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది. 1988 జనవరి 15న రిలీజైన ఇన్స్పెక్టర్ ప్రతాప్ కూడా యావరేజ్ అనిపించుకుంది. 1990 జనవరి 12న రిలీజైన ప్రాణానికి ప్రాణం సినిమా డిజాస్టర్ అయింది. 1996 జనవరి 5న రిలీజైన ‘వంశానికొక్కడు’ మంచి హిట్టుగా నమోదయింది. 1997 జనవరి 10 రిలీజైన పెద్దన్నయ్య బ్లాక్ బస్టర్ హిట్టైంది. 1999 జనవరి 13న రిలీజైన సమరసింహారెడ్డి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2000 జనవరి 14 న రిలీజైన వంశోద్ధారకుడు మూవీ యావరేజ్ గా అయింది. 2001 జనవరి 11న రిలీజైన నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2002 జనవరి 11న వచ్చిన సీమసింహం యావరేజ్ గా నిలిచింది. 2004 జనవరి 14న రిలీజైన లక్ష్మీ నరసింహ మూవీ మంచి హిట్టైంది. 2008 జనవరి 11న వచ్చిన ఒక్కమగాడు డిజాస్టరైంది. అలాగే 2011 జనవరి 11 రిలీజైన ‘పరమవీరచక్ర’ మూవీ సైతం డిజాస్టరైంది. ఆ తర్వాత ఐదేళ్ళకు 2016 జనవరి 14న రిలీజైన డిక్టేటర్ మూవీ సైతం అట్టర్ ఫ్లాప్ అయింది. 2017 జనవరి 12న రిలీజైన గౌతమీ పుత్రశాతకర్ణి సినిమా సూపర్ హిట్టైంది. ఇక 2018 జనవరి 12న రిలీజైన జైసింహా పర్వాలేదనిపించుకుంది. 2019 జనవరి 9న రిలీజయిన యన్టీఆర్ కథానాయకుడు మూవీ డిజాస్టర్ గా నమోదయింది. ఇక 2023 సంక్రాంతి బరిలో 17వ సారి బాలయ్య ‘వీరసింహారెడ్డి’ గా వచ్చి మంచి విజయం సాధించి అభిమానులకి మాస్ ఫీస్ట్ ని ఇచ్చారు.

అక్కినేని నాగార్జున తన కెరీర్ లో మొత్తం 5 సార్లు మాత్రమే సంక్రాంతి సినిమాలతో వచ్చారు. నాగార్జున నాలుగో సినిమాగా సంక్రాంతికి రిలీజైన మజ్ను నాగార్జున కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నమోదైంది. 1989 జనవరి 19న రిలీజైన విజయ్ సినిమా డిజాస్టరైంది. 1992 జనవరి 10న రిలీజైన కిల్లర్ సూపర్ హిట్టైంది. మలయాళ డైరెక్టర్ ఫాజిల్ ఈ మూవీని తెరకెక్కించాడు. 2016 జనవరి 15న రిలీజైన సోగ్గాడే చిన్నినాయనా మూవీ నాగార్జున కెరీర్ లోనే హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ ఏడాది రిలీజైన సంక్రాంతి మూవీస్ లో నెంబర్ 1 గా నిలిచింది. ఇక నాగార్జున 2022 లో బంగార్రాజు మూవీతో ఐదో సారి సంక్రాంతి బరిలోకి దిగారు. ఆ ఏడాది వార్ లో కూడా నాగ్ విన్నర్ గా నిలిచారు. బంగార్రాజు సూపర్ హిట్ గా నిలిచింది.

విక్టరీ వెంకటేశ్ తన కెరీర్ లో ఇప్పటి వరకూ 13 సార్లు సంక్రాంతి రేస్ లోకి దిగారు. వీటిలో ఎక్కువ శాతం మంచి సక్సెస్ సాధించాయి. అయితే అందులో ఎక్కువగా ఫ్యామిలీ మూవీసే హిట్టవడం విశేషం. విక్టరీ వెంకటేశ్ తొలి సంక్రాంతి సినిమా ‘రక్తతిలకం’. 1988 జనవరి 14న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఆ తర్వాత 1989 జనవరి 10న రిలీజైన ‘ప్రేమ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇందులో వెంకీ నటనకు నంది అవార్డ్ దక్కింది. 1991 జనవరి 2న రిలీజైన శత్రువు మూవీ కూడా వెంకీకి సూపర్ హిట్ తెచ్చిపెట్టింది. 1993 జనవరి 13న రిలీజైన ధర్మచక్రం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో కూడా వెంకీ నంది అవార్డు అందుకున్నారు. 2000 జనవరి 14న రిలీజైన ‘కలిసుందాం రా’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇక 2021 జనవరి 14 రిలీజైన దేవీపుత్రుడు సినిమా ఫ్లాప్ గా నిలిచింది. 2006 జనవరి 14న రిలీజైన ‘లక్ష్మి’ సినిమా సూపర్ హిట్టైంది. 2010 సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజైన శ్రీను వైట్ల కామెడీ మూవీ ‘నమో వెంకటేశ’ యావరేజ్ గా నిలిచింది. 2012 జవవరి 14న రిలీజైన బాడీగార్డ్ మూవీ పర్వాలేదనిపించుకుంది. 2013 జనవరి 11న రిలీజైన మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో మహేశ్ బాబు మరో హీరోగా నటించాడు. ఇక 2015 జనవరి 15న రిలీజైన ‘గోపాల గోపాల’ సినిమా మంచి హిట్టైంది. ఇందులో పవన్ కళ్యాణ్ గాడ్ గా నటించారు. 2019, జనవరి 12న రిలీజైన అనిల్ రావిపూడి మల్టీస్టారర్ మూవీ ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇందులో మరో హీరోగా వరుణ్ తేజ్ నటించాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికొస్తే ఆయన కెరీర్ లో మొత్తం 3 సార్లు మాత్రమే సంక్రాంతి బరిలోకి దిగారు. వాటిలో రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయి. పవర్ స్టార్ తొలి సంక్రాంతి మూవీ 1998లో రిలీజైన ‘సుస్వాగతం’. ఈ సినిమా సూపర్ హిట్టైంది. పవన్ కళ్యాణ్ కెరీర్ కు మంచి బూస్టప్ నిచ్చిన సినిమాగా నిలిచిపోయింది. ఆ తర్వాత 2015 జనవరి 15న వెంకటేష్ తో కలిసి వచ్చిన ‘గోపాలా గోపాలా’ మంచి సక్సెస్ అయింది. మరో సంక్రాంతి మూవీ ‘అజ్ఞాతవాసి’ 2018 జనవరి 10న రిలీజైన ఈ సినిమా డిజాస్టరైంది.

జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో మొత్తం 5 సార్లు సంక్రాంతి వార్ లో బరిలోకి దిగాడు. జూనియర్ ఎన్టీఆర్ 2002లో మొట్టమొదటి సంక్రాంతి సినిమాగా నాగ రిలీజైంది. డికే సురేశ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక 2004 లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ సైతం డిజాస్టరైంది. అలాగే 2005 సంక్రాతి కానుకగా జనవరి 14న రిలీజైన ‘నా అల్లుడు’ మూవీ కూడా డిజాస్టర్ అయింది. 2010 సంక్రాంతి కానుకగా జవనరి 13న రిలీజైన ‘అదుర్స్’ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమాలోని యన్టీఆర్ ద్విపాత్రాభినయం హైలైట్స్ గా నిలిచాయి. ఎస్పెషల్లీ బ్రహ్మానందం, తారక్ కాంబో సీన్స్ సినిమాకి అడ్వాంటేజ్ గా మారాయి. 2016 జనవరి 16న సంక్రాంతి కానుకగా రిలీజైన నాన్నకు ప్రేమతో మూవీ సూపర్ హిట్టైంది.

సూపర్ స్టార్ మహేశ్ బాబు విషయానికొస్తే తన కెరీర్ లో మొత్తం 6 సార్లు సంక్రాంతి బరిలోకి దిగాడు. మహేశ్ బాబు కెరీర్ లో మొట్టమొదటి సంక్రాంతి మూవీగా ‘టక్కరి దొంగ’. 2001 జనవరి 12న రిలీజైన ఈ సినిమా డిజాస్టరైంది. అయితే 2003, జనవరి15న రిలీజైన ‘ఒక్కడు’ సినిమా బ్లాక్ బస్టర్ తో మహేశ్ బాబు స్టార్ డమ్ అందుకున్నాడు. 2012 జనవరి 13న రిలీజైన బిజినెస్ మేన్ సినిమా సూపర్ హిట్టైంది. 2013 జనవరి 11న వెంకటేష్ తో కలిసి చేసిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ రిలీజయి సూపర్ హిట్టైంది. 2014 జనవరి 10న రిలీజైన సుకుమార్ మూవీ ‘వన్ నేనొక్కడినే’ డిజాస్టర్ అయింది. ఇక 2020 జనవరి 11న రిలీజైన ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టైంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికొస్తే తన కెరీర్ లో ఇప్పటి వరకూ మొత్తం 3 సార్లు సంక్రాంతి బరిలోకి దిగాడు అల్లు అర్జున్. 2007 జనవరి 12న రిలీజైన ‘దేశముదురు’ బన్నీ తొలి సంక్రాంతి మూవీ. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బన్నీ నటించిన ఫస్ట్ మూవీ ఇదే. ఈ మూవీ సూపర్ హిట్టైంది. 2014 జనవరి 12న రిలీజైన ‘ఎవడు’ లో బన్నీ గెస్ట్ లాంటి పాత్ర పోషించాడు. ఇందులో మెయిన్ హీరో రామ్ చరణ్. ఈ సినిమా సూపర్ హిట్టైంది. ఆ తర్వాత మళ్లీ బన్నీ నటించిన మరో సంక్రాంతి మూవీ 2020 జనవరి 12న రిలీజైన ‘అల వైకుంఠపురములో’. త్రివిక్రమ్ డైరెక్షన్ లో రిలీజైన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది.

Netflix : నెట్‌ఫ్లిక్స్ సంక్రాంతి పండగ.. ఒకే రోజు 16 తెలుగు సినిమాలు అనౌన్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయానికొస్తే తన కెరీర్ లో మొత్తం 2 సార్లు మాత్రమే సంక్రాంతి బరిలోకి దిగాడు. 2004 లో రిలీజైన ‘వర్షం’ ప్రభాస్ తొలి సంక్రాంతి మూవీ. జనవరి 14న రిలీజైన ఈ సినిమా ప్రభాస్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ 2007 జనవరి 14న యోగి మూవీతో సంక్రాంతి బరిలోకి దిగాడు ప్రభాస్. ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది.

ఇంకా వీరే కాకుండా చాలామంది చిన్న హీరోలు కూడా అప్పుడప్పుడు తమ అదృష్టాన్ని సంక్రాంతికి పరీక్షించుకున్నారు. తెలుగు వారి పెద్ద పండగ, సంక్రాంతికి తమ సినిమా ఒక్కసారైనా రిలీజవ్వాలని హీరోలంతా అనుకుంటారు.