Sankranthi Movies : సంక్రాంతి.. రొటీన్ సినిమాలు కావొచ్చు.. కానీ హిట్ కొట్టి కోట్లు రాబడుతున్నాయి..

 టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఈ సంక్రాంతి రేస్ లో స్టార్ హీరోలు రొటీన్ కథలతోనే అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందించారు. కథ లేకుండా కేవలం హీరో కోసం ఫార్ములాను మిక్స్ చేసి హిట్స్ కొట్టేశారు. 2023 సంక్రాంతి సీజన్ లోనూ రొటీన్ స్టఫ్ తోనే...............

Sankranthi Movies : సంక్రాంతి.. రొటీన్ సినిమాలు కావొచ్చు.. కానీ హిట్ కొట్టి కోట్లు రాబడుతున్నాయి..

Sankranthi Movies gets hit talk with routine stories

Sankranthi Movies :  టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఈ సంక్రాంతి రేస్ లో స్టార్ హీరోలు రొటీన్ కథలతోనే అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందించారు. కథ లేకుండా కేవలం హీరో కోసం ఫార్ములాను మిక్స్ చేసి హిట్స్ కొట్టేశారు. 2023 సంక్రాంతి సీజన్ లోనూ రొటీన్ స్టఫ్ తోనే సినిమాలొచ్చాయి. టాలీవుడ్ అండ్ కోలీవుడ్ స్టార్ హీరోలు ఫార్ములా బేస్ట్, హీరో బేస్డ్ స్టోరీస్ తోనే ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశారు. ఈ సంక్రాంతికి ముఖ్యంగా చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, అజిత్ తునివు, విజయ్ వారసుడు సినిమాలతో వచ్చారు.

సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ లో చిరు వింటేజ్ లుక్, మేనరిజమ్స్, కామెడీ వర్కవుట్ అయ్యాయి. సెకండాఫ్ లో రవితేజ సినిమాను నిలబెట్టాడు. దీంతో హీరోల మీద కథ, మాస్ ఎలివేషన్స్ తో సినిమాని నిలబెట్టి మాములు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాతోనే వచ్చారు. కానీ ఈ రొటీన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని కూడా అభిమానులు, ప్రేక్షకులు హిట్ చేసి కోట్లు కలెక్షన్స్ గుమ్మరించి మరోసారి స్టార్ హీరోలకి కమర్షియల్ సక్సెస్ లు వస్తాయని నిరూపించారు. రొటీన్ కథ -కథనంతో వచ్చినా వింటేజ్ చిరుని చూపించి, ఎలివేషన్స్ తో భారీ కలెక్షన్స్ రాబడుతున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య సినిమా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది.

బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ కూడా రొటీన్ ఫార్ములాతో అల్లిన కథే. ఫస్ట్ హాఫ్ అంతా సింహా, లెజెండ్ లా సాగి రెండో భాగంలో చెన్నకేశవ రెడ్డి, సమర సింహారెడ్డి సినిమాలను గుర్తుచేసింది. ‘క్రాక్’ లో అంతో ఇంతో కొత్తదనం చూపించి మాస్ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేసిన గోపిచంద్ మలినేని తన అభిమాన హీరో బాలయ్యను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో బాలయ్యకి అచ్చొచ్చిన ఓల్డ్ స్కూల్ ఫార్ములాతో ఈ సినిమా తీశాడు. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసినా, కథ పాతదే అయినా, ఎలివేషన్స్, చిన్న చిన్న ట్విస్టులు, సెంటిమెంట్ తో గట్టిగా ట్రై చేసి హిట్ కొట్టేశారు. బాలయ్య పవర్ ఫుల్ క్యారెక్టర్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగా పనిచేయడంతో సంక్రాంతి బరిలో ఈ సినిమా కూడా హిట్ అయి వసూళ్ళు బాగా రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా 120 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ చేసింది.

ఇక విజయ్ ‘వారసుడు’ సినిమా అయితే పూర్తిగా రొటీన్ స్టఫ్ తోనే తెరకెక్కింది. ట్రైలర్ చూసే ఇది పరమ రొటీన్ సినిమా అని ఫిక్స్ అయిపోయిన ప్రేక్షకులకు చాలా సినిమాలు గుర్తుచేశాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. తమిళ్ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది అనుకున్నాడో ఏమో కానీ ‘వారసుడు’ తో తెలుగు ప్రేక్షకులను మాత్రం బోర్ కొట్టించాడు. ఇలాంటి సినిమాలు టాలీవుడ్ లో గతంలో చాలా వచ్చాయని మర్చిపోయాడు. కానీ విజయ్ మొదటి సారి పూర్తి ఫ్యామిలీ సినిమా చేయడంతో తమిళ్ లో వర్కౌట్ అయి కలెక్షన్స్ బాగానే వస్తూ హిట్ కొట్టింది ఈ సినిమా.

NTR for Oscars : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్.. ఈ టాప్ 10 కన్సిడర్ చేయండి ఆస్కార్ అంటూ హాలీవుడ్ మీడియా..

అలాగే అజిత్ ‘తెగింపు’ సినిమా కూడా రొటీన్ ఫార్ములాతో తీసిన సినిమానే. బ్యాంక్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో, ఓ మెసేజ్ తో అల్లుకొన్న ఈ సినిమా స్టోరీ టాలీవుడ్ లో మాత్రం థ్రిల్ చేయలేకపోయింది. కానీ తమిళ్ లో మాత్రం స్టార్ హీరో కావడంతో, సంక్రాంతి సీజన్ కావడంతో అభిమానులు ఈ సినిమాని కూడా హిట్ చేసి భారీ కలెక్షన్స్ ఇచ్చారు. మొత్తానికి సంక్రాంతికి వచ్చిన స్టార్ హీరోలు రొటీన్ కథలతో వచ్చినా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు.