Sankranti 2022: ఆ నలుగురు.. సైడిస్తారా..? ఢీ కొడతారా..?

పాన్ ఇండియాను మించి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తుందేమో అనేలా ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా-నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా..

Sankranti 2022: ఆ నలుగురు.. సైడిస్తారా..? ఢీ కొడతారా..?

Sankranti 2022 Films

Sankranti 2022: పాన్ ఇండియాను మించి పాన్ వరల్డ్ స్థాయికి వెళ్తుందేమో అనేలా ఆర్ఆర్ఆర్ ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మెగా-నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రామ్-భీమ్ వచ్చేస్తారని ప్రకటన వచ్చిన దగ్గర నుండి మరి మిగతా సినిమాల పరిస్థితి ఏంటి.. అందరికీ థియేటర్లు ఎక్కడ వస్తాయనే చర్చ ముమ్మరంగా జరుగుతుంది. మిగతా నలుగురు వెనక్కు వెళ్తారా.. లేక ఢీ కొడతారా అన్న ఆసక్తి నెలకొంది.

Telugu Films Releases: టార్గెట్ డిసెంబర్.. అందరి చూపు ఈనెలపైనే!

మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ తో సినిమాలకి బయటకొచ్చే ముహుర్తాలు దొరకలేదు. ఎప్పుడెప్పుడా అని సీజన్ కోసం వెయిట్ చేసి సినిమాలన్నీ వరుసగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. అయితే, సడెన్ గా రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యడంతో మిగతా సినిమాల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. జనవరి 7న ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఇవ్వడంతో ఎందుకొచ్చిన గోలని పుష్ప క్రిస్ మస్ రిలీజ్ నుంచి ఒక వారం ముందుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ డేట్ మీద కొంత ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగానే ఆచార్య ఆచితూచి పండగ తర్వాత ప్లాన్ చేసుకున్నారు.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

ఇక, ఇప్పుడు పండగకి డేట్స్ ఇచ్చిన సినిమాలు ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, రాధేశ్యామ్ తో పాటు తమిళ హీరో అజిత్ వాలిమై. ఇందులో ఎవరు తగ్గుతారు.. ఎవరు ఢీ కొడతారన్నది అభిమానులలో విపరీతంగా చర్చ జరుగుతుంది. భీమ్లా నాయక్ నుండి వచ్చిన అంత ఇష్టం పాటతో పాటు కూడా సంక్రాంతికేనని ధీమాగా చెప్పారు. ఇక, రాధేశ్యామ్ కూడా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతిని టార్గెట్ చేసి బిజినెస్ మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక, మహేష్ సర్కారు వారి పాట మాత్రం సైడ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. మరి ఈ సంక్రాంతికి సినీ యుద్ధం తప్పదా.. లేక కనీసం ఇద్దరైనా తప్పుకుంటేనే మంచిదని భావిస్తారా అన్నది చూడాలి.