Sara Ali Khan: శుభ్‌మన్ గిల్‌తో డేటింగ్.. ఎట్టకేలకు స్పందించిన సారా అలీఖాన్
బాలీవుడ్ నటి సారా అలీఖాన్(Sara Ali Khan), క్రికెటర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)లు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై సారా అలీఖాన్ స్పందించింది.

Sara Ali Khan-Shubman Gill
Actress Sara Ali Khan: బాలీవుడ్ నటి సారా అలీఖాన్(Sara Ali Khan), క్రికెటర్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)లు డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అటు గిల్ గానీ, ఇటు సారా గానీ స్పందించలేదు. గతేడాది అక్టోబర్‌లో ఇద్దరు ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో కనిపించడంతో అప్పటి నుంచి రూమర్స్ ఊపందుకున్నాయి. కాగా.. తాజాగా వీటిపై సారా అలీఖాన్ స్పందించింది. అంతేకాదండోయ్.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి, ఏ రంగానికి చెందిన వాడు అయి ఉండాలన్న విషయాలను చెప్పేసింది.
సారా అలీఖాన్ నటించిన తాజా చిత్రం ‘జరా హాట్కే జరా బచ్కే’. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రమోషనల్ కార్యక్రమాల్లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సారాకు తన వివాహానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. కాబోయే భర్త ఎలా ఉండాలని అనుకుంటున్నారు..? షర్మిలా ఠాకూర్‌లా క్రికెటర్‌ను పెళ్లి చేసుకుంటారా..? అని అడిగారు.
Megha Akash: పీకల్లోతు ప్రేమలో మేఘా ఆకాశ్.. త్వరలోనే పెళ్లి..? వరుడు అతడేనంట..?
ఇందుకు సారా తనదైన శైలిలో బదులు ఇచ్చింది. మానసిక, మేధో స్థాయిలో నన్ను సరిపోలిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అతడు ఏ రంగానికి చెందిన వాడైనా సరే ఓకే అని తెలిపింది. క్రికెటర్ కావొచ్చు, వ్యాపారవేత్త కావొచ్చు, నటుడు కావొచ్చు.. ఎవరైనా సరే నా విలువలను గౌరవిస్తే చాలని మిగతాది పట్టించుకోనంది.
ఓ క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించింది. “నేను మీతో నిజాయితీగా ఉంటాను. నేను ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నా జీవిత భాగస్వామిని ఇప్పటి వరకు కలిశానని నేను అనుకోవడం లేదు. ఇంకా కలవలేదు. ఇది మాత్రం పూర్తి భరోసాతో చెబుతున్నా.” అంటూ డేటింగ్ వార్తలను కొట్టిపారేసింది.
కాగా.. సారా అలీఖాన్ అమ్మమ్మ ప్రముఖ నటి షర్మిలా ఠాగూర్ భారత లెజెండరీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
Varun – Lavanya : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్ కన్‌ఫార్మ్.. మెగా టీం అఫిషియల్ నోట్!