Sara Ali Khan : ఒక్క టవల్ కాస్ట్ మరీ అంతా.. కాస్ట్‌లీ టవల్ కొన్నందుకు తల్లిని తిట్టిన హీరోయిన్..

సెలబ్రిటీలు కొనే వస్తువులను, వాటి రేట్లను చూసి ఒక్కోసారి సాధారణ ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. దేనికి ఎంత పెట్టాలో అంతే పెడ్తారు. అదే కోవలోకి వస్తుంది బాలీవుడ్(Bollywood) భామ సారా అలీఖాన్.

Sara Ali Khan : ఒక్క టవల్ కాస్ట్ మరీ అంతా.. కాస్ట్‌లీ టవల్ కొన్నందుకు తల్లిని తిట్టిన హీరోయిన్..

Sara Ali Khan scolds her mother for buying a towel with high cost

Sara Ali Khan : సాధారణంగా సెలబ్రిటీలు ఏం కొన్నా అన్నీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. బ్రాండెడ్ వస్తువులు అని కొన్ని కొన్ని ఎక్కువ రేట్లు పెట్టి కొంటూ ఉంటారు సెలబ్రిటీలు. సెలబ్రిటీలు కొనే వస్తువులను, వాటి రేట్లను చూసి ఒక్కోసారి సాధారణ ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు మాత్రం జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. దేనికి ఎంత పెట్టాలో అంతే పెడ్తారు. అదే కోవలోకి వస్తుంది బాలీవుడ్(Bollywood) భామ సారా అలీఖాన్.

సైఫ్ అలీఖాన్ కూతురిగా సినీ పరిశ్రమకు పరిచయమైనా సారా అలీఖాన్ ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుత విక్కీ కౌశల్ తో కలిసి చేసిన ‘జరహట్ కే జరబచ్ కే’ సినిమా జూన్ 2న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్రయూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో విక్కీ కౌశల్, సారా అలీఖాన్ పలు ఆసక్తికర విషయాలను తెలియచేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో విక్కీ కౌశల్ సారాకు సంబంధించి ఓ విషయాన్ని రివీల్ చేశాడు.

NBK 108 : బాలయ్య అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఇదేనా? సోషల్ మీడియాలో వైరల్.. ఇంత మీనింగ్ ఉందా టైటిల్‌లో?

విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. ఓ సారి షూటింగ్ గ్యాప్ లో సారా వాళ్ళ మమ్మీని బాగా తిట్టేస్తుంది ఫోన్ లో. ఫోన్ పెట్టేశాక ఎందుకు అంత ఫైర్ అవుతున్నావు, ఎవరిమీద అని అడిగితే.. మా అమ్మ 1600 పెట్టి ఒక టవల్ కొంది. అందుకే తిడుతున్నాను అని చెప్పింది. నేను ఆశ్చర్యపోయి నిజం చెప్పు ఎవరైనా 1600 పెట్టి టవల్ కొంటారా అని అడిగితే ఔను, అందుకే తిడుతున్నాను అని చెప్పింది అంటూ తెలిపాడు. పక్కనే ఉన్నా సారా కలగచేసుకొని దాంట్లో తప్పేముంది.. నిజంగానే 1600 పెట్టి ఎవరైనా టవల్ కొంటారా? అందుకే మా అమ్మను తిట్టాను అని తెలిపింది.

ఇక సారా అలీఖాన్ తల్లి అమ్రితా సింగ్ ఒకప్పుడు హీరోయిన్ గా, ఆ తర్వాత సహాయనటిగా పనిచేసింది. సైఫ్ అలీఖాన్ తో విడిపోయిన తర్వాత కొన్నాళ్ళు సినిమాలు చేసినా ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటుంది అమ్రితా.