Sarath Babu : శరత్ బాబు చివరి సినిమా ఏంటో తెలుసా? మూడు రోజుల్లో రిలీజ్.. అంతలోనే..

శరత్ బాబు 2014 తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు. చివరిసారిగా శరత్ బాబు తెలుగులో 2021 లో రిలీజయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో వెండితెరపై కనిపించారు.

Sarath Babu : శరత్ బాబు చివరి సినిమా ఏంటో తెలుసా? మూడు రోజుల్లో రిలీజ్.. అంతలోనే..

Sarath Babu last movie releasing soon

Sarath Babu Last Movie :  ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ నిన్న మే 22 సాయంత్రం మరణించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో దాదాపు 3000కి పైగా సినిమాల్లో నటించారు శరత్ బాబు. ఆయన మరణంతో టాలీవుడ్(Tollywood) లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

శరత్ బాబు 2014 తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు. చివరిసారిగా శరత్ బాబు తెలుగులో 2021 లో రిలీజయిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో వెండితెరపై కనిపించారు. ఇక తమిళ్ లో ఇటీవలే వచ్చిన వసంత ముల్లై అనే సినిమాలో కనిపించారు. అయితే శరత్ బాబు చివరి సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

Chiranjeevi – Pawan Kalyan : శరత్ బాబుకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ నివాళులు.. వెండితెర జమిందార్ శరత్ బాబు!

MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర జంటగా తెరకెక్కిన మళ్ళీ పెళ్లి సినిమాలో శరత్ బాబు నటించారు. ఈ సినిమాలో శరత్ బాబు, జయసుధ కలిసి నటించారు. ఆయన చివరిసారిగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా నరేష్ – పవిత్ర కథతో తెరకెక్కుతుండటంతో ఆయన సూపర్ స్టార్ కృష్ణ పాత్ర వేసినట్టు సమాచారం. కానీ అంతలోనే ఆయన మరణించడంతో చిత్రయూనిట్ కూడా విషాదంలో మునిగింది. ఆయన్ని చివరిసారిగా ఈ సినిమాతో వెండితెరపై చూడొచ్చు.