సూపర్ స్టార్ దీపావళి శుభాకాంక్షలు

తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెప్తూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

10TV Telugu News

తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెప్తూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు దీపావళి  కానుక వచ్చేసింది. తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు చెప్తూ.. ‘సరిలేరు నీకెవ్వరు’ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్.. మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘సరిలేరు నీకెవ్వరు’..

మహేష్ బాబు, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్అజయ్ కృష్ణగా కనిపించనున్నాడు. దసరాకు రిలీజ్ చేసిన మహేష్ గొడ్డలి పట్టుకుని ఉన్న పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Read Also : ‘వెంకీమామ’ : మామా అల్లుళ్ల లుక్ అదిరిందిగా!

ఈ ఉదయం (అక్టోబర్ 26) లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాలో భారతి క్యారెక్టర్ చేస్తున్నట్టు ఆమె లుక్ రిలీజ్ చేసిన మేకర్స్, సాయంత్రం మహేష్ బుల్లెట్‌పై వస్తున్న న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు. రాక్ స్టార్ డీఎస్పీ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

×