Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల...

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!

Sarkaru Vaari Paata 11 Days Worldwide Collections

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్‌ను ఆడియెన్స్ పూర్తిగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాలో మహేష్ టైమింగ్, డైలాగ్ డెలివరీ సూపర్బ్‌గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా 11 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా షేర్ వసూళ్లు రాబట్టి మహేష్ స్టామినా ఏమిటో మరోసారి రుజువు చేసింది. ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా పట్టం కడుతుండటంతో అక్కడా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. పరశురామ్ పెట్ల పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతోంది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మహేష్ వేట మామూలుగా లేదుగా!

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 11 రోజుల రన్‌లో రూ.86 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టగా, రూ.129 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, సముద్రఖని, నదియా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఏరియాలవారీగా ఈ సినిమా 11 డేస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 32.21 కోట్లు
సీడెడ్ – 11.07 కోట్లు
ఉత్తరాంధ్ర – 11.94 కోట్లు
గుంటూరు – 8.34 కోట్లు
ఈస్ట్ – 8.18 కోట్లు
వెస్ట్ – 5.38 కోట్లు
కృష్ణా – 5.61 కోట్లు
నెల్లూరు – 3.34 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 86.07 కోట్లు (రూ.129.15 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 6.51 కోట్లు
ఓవర్సీస్ – 12.10 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.104.68 కోట్లు (గ్రాస్ రూ.167.80 కోట్లు)