Sarkaru Vaari Paata: మాసివ్ హిట్ టార్గెట్‌గా ఎస్‌వీపీ.. బాక్సాఫీస్ బద్దలే!

మ మ మాస్... అంటున్నారు సౌత్ హీరోలు. మాస్ జపం చేస్తూ సూపర్ హిట్ కొడుతున్నారు. ఇండియన్ సినిమాల్లో మాస్ మ్యానరిజంతో అదరగొడుతున్న స్టార్స్ కు కలెక్షన్ల పట్టం కడుతున్నారు ప్రేక్షకులు.

Sarkaru Vaari Paata: మాసివ్ హిట్ టార్గెట్‌గా ఎస్‌వీపీ.. బాక్సాఫీస్ బద్దలే!

Sarkaruvaari Paata

Sarkaru Vaari Paata: మ మ మాస్… అంటున్నారు సౌత్ హీరోలు. మాస్ జపం చేస్తూ సూపర్ హిట్ కొడుతున్నారు. ఇండియన్ సినిమాల్లో మాస్ మ్యానరిజంతో అదరగొడుతున్న స్టార్స్ కు కలెక్షన్ల పట్టం కడుతున్నారు ప్రేక్షకులు. ఇప్పుడదే కల్డ్ అండ్ కిక్ తో మహేశ్ బాబు సైతం సర్కారు వారి పాటను చూపించబోతున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. మ మ మాస్ అంటూ హీరోలు యాక్షన్ కలరింగ్ ఇస్తుంటే ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. సరైన కంటెంట్ కి తగ్గట్టు హీరోల మాసిజం ఎలివేట్ అయిందా.. బాక్సాఫీస్ బద్దవలడం గ్యారంటీ. ఇప్పుడిదే సూత్రాన్ని నమ్ముకుని సర్కారు వారి పాట పాడబోతున్నారు మహేశ్ బాబు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట.. లీకు రాయుళ్ల పుణ్యమే!

మ మ మహేశా అంటూ మాసివ్ డ్యూయెట్ ని వినిపించిన సర్కారు వారి పాట టీమ్.. అంతకుమించిన మాస్ మసాలాను సినిమాలో మిక్స్ చేసి ప్రేక్షకులకు మాంచి నాన్ వెజ్ మీల్స్ వడ్డించబోతున్నామని చెప్తున్నారు. మహేశ్ ఇంటెన్స్ లుక్.. బి, సి సెంటర్లను టార్గెట్ చేసే డైలాగ్ డెలివరీ ఏ రేంజ్ లో ఉండబోతుందనేది ట్రైలర్ తోనే చెప్పేసారు. మే 12న మాసివ్ హిట్ టార్గెట్ గా దూసుకొస్తున్నారు.

Sarkaru Vaari Paata: మాంచి ఆకలి మీదున్న ఫ్యాన్స్.. రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్

మహేశ్ బాబుకు గతంలో సూపర్ సక్సెస్ గా నిలిచిన సినిమాలు కూడా మాస్ ఎలిమెంట్స్ ని ప్రెజెంట్ చేసినవే. కెరీర్ మైల్ స్టోన్ గా నిలిచిన పోకిరి.. ఉన్నట్టుండి హై స్పీడ్ పెంచిన దూకుడు లాంటి సినిమాలు మహేశ్ కటౌట్ ను మాస్ హైట్స్ లో నిలబెట్టినవే. పోకిరి, దూకుడు తర్వాత ఆ రేంజ్ కాదు కాదు ఆ మీటర్ కు పైగానే సర్కారు వారి పాటను రెడీ చేసారని చెప్తున్నారు. ప్రస్తుతం నడుస్తోన్న మాస్ హవాను సర్కారు వారి పాట కంటిన్యూ చేస్తోందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Sarkaru Vaari Paata: SVP పాన్ ఇండియాగా ఎందుకు రిలీజ్ చేయడం లేదంటే?

క్లాసీగా కనిపించే మాస్ మూవీస్ తీసే దర్శకుడు పరశురామ్. తనదైన రచనతో కట్టిపడేసే పరశురామ్ మహేశ్ బాబు లుక్, డైలాగ్ డెలివరీ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఫుల్ ఎనర్జిటిక్ రోల్ లో సూపర్ స్టార్ ను చూడబోతున్నామని ట్రైలర్ తోనే డిసైడయ్యారు ఫ్యాన్స్. మహేశ్ మేనరిజం, యాక్టింగ్, డాన్స్, వేరియేషన్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ కిక్కిస్తారనే నమ్మకంతో ఉన్నాడు పరశురామ్. సో సర్కారు వారి పాట బాక్సాఫీస్ మాస్ సునామీని సృష్టిస్తే పరశురామ్ కూడా టాప్ లీగ్ కి చేరుకోవడం సులభమే.