Mahesh Babu : ప్రేమికుల దినోత్సవం రోజు ‘సర్కారు వారి పాట’ నుంచి ఫస్ట్ సాంగ్

తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్ డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ''ఈ ప్రేమికుల దినోత్సవానికి మెలోడీ సాంగ్ అఫ్ ది ఇయర్ తో ప్రేమలో పడండి'' అంటూ పోస్ట్ చేస్తూ ఈ ప్రేమికుల దినోత్సవం..........

Mahesh Babu : ప్రేమికుల దినోత్సవం రోజు ‘సర్కారు వారి పాట’ నుంచి ఫస్ట్ సాంగ్

Mahesh Babu (1)

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా “సర్కారు వారి పాట”. కరోనా కారణంగా, ఇటీవల మహేష్ కి మోకాలి సర్జరీ, ఆ తర్వాత మహేష్ కు కరోనా రావడం.. వీటన్నితో సినిమా మరింత ఆలస్యం అవుతుంది. ఇంకా ఈ సినిమాకి ఒక షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉంది. ఇప్పటికే ఈ సినిమాని సమ్మర్ కి వాయిదా వేశారు.

చాలా రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. గతంలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మహేష్ అభిమానులు ఈ సినిమా నుంచి అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే తమన్ ఈ సినిమా నుంచి ఒక మ్యూజిక్ బైట్ ని వినిపిస్తూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనికి విపరీతమైన స్పందన వచ్చింది.

Pawan Kalyan : పద్మ పురస్కారగ్రహీతలకు ప్రత్యేక అభినందనలు తెలిపిన పవన్‌కళ్యాణ్

తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్ డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ”ఈ ప్రేమికుల దినోత్సవానికి మెలోడీ సాంగ్ అఫ్ ది ఇయర్ తో ప్రేమలో పడండి” అంటూ పోస్ట్ చేస్తూ ఈ ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14 న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నామని తెలిపారు. ఈ పోస్ట్ తో పాటు తమన్ పియానో వాయిస్తున్న ఫోటోని జత చేసి సర్కారు వారి పాట ఫస్ట్ సింగిల్ ఫిబ్రవరి 14న రానుందని తెలిపారు.