Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా! | Sarkaru Vaari Paata Gets Additional Week Benefit

Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది....

Sarkaru Vaari Paata: మహేష్ బాబుకు మరో వారం కలిసొచ్చిందిగా!

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ భారీ అంచనాల మధ్య మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించడంతో, ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్, ఊరమాస్ పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 8 రోజుల కలెక్షన్స్.. సెంచరీ కన్ఫం!

ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు దాటడంతో కలెక్షన్స్ కాస్త నెమ్మదించాయి. అయితే ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేవీ రిలీజ్‌కు లేకపోవడం.. రిలీజ్ అయిన రెండుమూడు సినిమాలు కూడా సోసోగా ఉండటంతో, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’కు మరో వారం అదనంగా లభించనుందని చెప్పాలి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయిన కాస్తోకూస్తో పేరున్న సినిమా ‘శేఖర్’కు మిక్సిడ్ టాక్ రావడంతో, ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. ఇక బండ్ల గణేష్ నటించిన డేగల బాబ్జీ చిత్రం రిలీజ్ గురించి ప్రేక్షకులకు ఏమాత్రం ఐడియా కూడా లేదు. దీంతో ఈ సినిమా వచ్చిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు.

sarkaru Vaari Paata : అమెరికాలో ఈ రికార్డ్ ఒక్క మహేష్ బాబుకే.. రీజనల్ సినిమాతో వరుసగా నాలుగో సారి..

తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ చిత్రం మాత్రమే కొంతమేర ఆడియెన్స్‌ను మెప్పిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ కొంతవరకు ఇంట్రెస్ట్‌ను కనబరుస్తున్నారు. ఇక ఈ వీకెండ్‌లో సినిమాకు వెళ్లాలనుకునే తెలుగు ఆడియెన్స్‌కు ఉన్న ఆప్షన్ కేవలం ‘సర్కారు వారి పాట’నే. దీంతో ఈ సినిమాకు మరోసారి అడ్వాంటేజ్ దక్కిందని చెప్పాలి. మరి రెండో వారంలో సర్కారు వారి పాట ఎంతమేర వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

×