Sarkaru Vaari Paata: ఓటీటీలో సర్కారు వారి పాట.. ఎప్పుడంటే..?
ఎప్పుడెప్పుడా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు...

Sarkaru Vaari Paata: ఎప్పుడెప్పుడా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించడటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అదిరిపోయే బజ్‌ను క్రియేట్ చేయగా, ప్రమోషన్స్‌తో ఈ బజ్‌ను రెట్టింపు చేసింది చిత్ర యూనిట్.
Sarkaru Vaari Paata : భ్రమరాంబ థియేటర్లో బెనిఫిట్ షో.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన నమ్రత..
ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి టాక్ వస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ ఉండబోతుందని వారు చిత్ర యూనిట్‌తో ఒప్పందం చేసుకున్నారట.
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు టీ-సర్కార్ ‘స్పెషల్’ ఆఫర్!
అంటే సర్కారు వారి పాట చిత్రానికి బాక్సాఫీస్ రిజల్ట్ చాలా కీలకం కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రాక ఆలస్యం అవుతుంది. ఒకవేళ సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తేడా కొట్టినా, కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమవుతుందని తెలుస్తోంది. మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా, థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి.
- Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ
- Gautham : టెన్త్ పాసైన గౌతమ్.. గర్వపడుతున్నాము అంటూ.. జర్మనీలో పార్టీ చేసుకుంటున్న మహేష్ ఫ్యామిలీ..
- Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
- Mahesh Babu: మహేష్ సినిమాలో నందమూరి హీరో.. ఇక బాక్సులు బద్దలే!
- Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
1Southwest Monsoon : కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు
2జగన్ నీ పతనం మొదలైంది..!
3Boney Kapoor : బోనికపూర్ క్రెడిట్ కార్డు నుంచి 3.82 లక్షలు చోరీ.. పోయినట్టు కూడా తెలీదు..
4వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం
5మహానాడు వేదికగా చంద్రబాబు సవాల్…!
6కమ్మ సామాజిక వర్గానికి దగ్గరయ్యే ప్రయత్నమా..?
7Delhi : నైజీరియా వ్యక్తి నిర్వాకం..పెళ్లి పేరుతో 300 మంది భారతీయ మహిళలను మోసగించి..రూ.కోట్లు దోచేసిన ఘనుడు
8తారక మంత్రం జపిస్తున్న టీఆర్ఎస్ నేతలు
9టీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి : తెలకపల్లి విశ్లేషణ
10Sleep Position : ఏ భంగిమలో నిద్రించాలి.. ఏవైపు తిరిగితే మంచిదంటే?
-
Cyber Criminals : లోన్ ఇప్పిస్తామని రూ.40,000 కాజేసిన సైబర్ నేరగాళ్లు
-
Jalli Keerthi : ఐఏఎస్ సేవకు అందరూ ఫిదా..వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా తెలంగాణ ఆడబిడ్డ
-
TRS : ఎన్టీఆర్‌కు ఘనంగా టీఆర్ఎస్ నివాళి..!
-
Unscrupulous activities : ఆంధ్రాయూనివర్శిటీలో అసాంఘీక కార్యకలాపాలు
-
Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్కౌంటర్
-
Adilabad : వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందని కూతురు గొంతు కోసి చంపిన తండ్రి
-
IPL 2022: ఆర్సీబీ కల చెదిరే.. 15 ఏళ్లుగా టైటిల్ పోరాటం.. ఈ పెయిన్ కోహ్లీకి మాత్రమే తెలుసు!
-
Minister KTR : మంత్రి కేటీఆర్ యూకే, దావోస్ పర్యటన..తెలగాంణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు