Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే..

మహేష్ స్టామినాతో భారీ విజయం అందుకుంది సర్కారు వారి పాట. ఈ సినిమా విజయంపై మహేష్, చిత్ర యూనిట్, నిర్మాతలు, అభిమానులు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతటి భారీ విజయాన్ని................

Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అందులోనే..

Sarkaru Vari Paata

Sarkaru Vaari Paata :  మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన సినిమా సర్కారు వారి పాట. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలకి మించి హిట్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్ లో సరికొత్త రికార్డులని సృష్టించింది ఈ సినిమా. ఒక రీజనల్ సినిమాగా తెలుగులో మాత్రమే రిలీజ్ అయి దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసింది అంటే మామూలు విషయం కాదు.

మహేష్ స్టామినాతో భారీ విజయం అందుకుంది సర్కారు వారి పాట. ఈ సినిమా విజయంపై మహేష్, చిత్ర యూనిట్, నిర్మాతలు, అభిమానులు అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతటి భారీ విజయాన్ని ఇచ్చినందుకు మహేష్ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పడమే కాకుండా కెరీర్ లో మొదటిసారి స్టేజిపై స్టెప్పులేశాడు. దీంతో అభిమానుల్లో కూడా మరింత ఉత్సాహం వచ్చింది. ఇక ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

ఫ్రెండ్స్ తో కలిసి కేరళలో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ కీర్తి సురేష్

ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో 199 రూపాయలకు చెల్లించి చూసేలా సర్కారు వారి పాట సినిమాని పెట్టారు. అయితే దీనిపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆల్రెడీ సబ్ స్క్రిప్షన్ ఉంచుకొని మళ్ళీ డబ్బులు ఎందుకు అని పలువురు కామెంట్లు చేశారు. తాజాగా అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ఉన్న వారందరికీ ఎలాంటి సపరేట్ చార్జీలు లేకుండానే జూన్ 23 నుంచి సర్కారు వారి పాట సినిమా అందుబాటులో ఉండనుందని ప్రకటించారు. తెలుగు, తమిళ్, మలయాళంలో సర్కారు వారి పాట అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 23 నుంచి స్ట్రీమ్ అవ్వనుంది.