Sarkaru Vaari Paata: ఎస్‌వీపీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ పవర్ స్టార్?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా..

Sarkaru Vaari Paata: ఎస్‌వీపీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ పవర్ స్టార్?

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ చిత్రంపై అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేయగా, ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి.

Sarkaru Vaari Paata: మెంటల్ మాస్..! సర్కారు వారి పాట ట్రైలర్ రిలీజ్.. హైలైట్స్ ఇవే!

సమ్మర్ ట్రీట్‌గా రాబోతున్న ఈ సినిమాను మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ పెంచేసిన ఎస్వీపీ టీం సోమవారం ట్రైలర్ రిలీజ్ చేసింది. మహేష్ మార్క్ మేనరిజంతో వచ్చిన యాక్షన్ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. అభిమానులతో పాటు మూవీ లవర్స్ ను ఈ ట్రైలర్ మెస్మరైజ్ చేయడంతో ఇదే జోష్ లో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తుంది ఎస్వీపీ యూనిట్.

Sarkaru Vaari Paata: మహేష్ నోట సీఎం జగన్ మాట.. పొలిటికల్ డైలాగ్‌కి లవ్ ఎఫెక్ట్!

ఇందులో భాగంగానే ఈనెల 7న హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో భారీ ఎత్తున అభిమానులు.. సినీ ప్రముఖుల మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాకాలు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో ఈ ఈవెంట్ పై మరింత క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటికే ఎస్వీపీ టీం పీకేని వేడుకకు ఆహ్వానించినట్లు గుసగుస వినిపిస్తుండగా.. అధికారికంగా ఎక్కడా సమాచారం లేదు. అయితే, ఒకవేళ అదే నిజమై సూపర్ స్టార్-పవర్ స్టార్ ఒకే వేదికపై కనిపిస్తే సర్కారు ప్రాంగణం అభిమానుల కేరింతలతో దద్దరిల్లడం ఖాయంగా కనిపిస్తుంది.