Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ వీడియో
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్....

Sarkaru Vaari Paata Released On Amazon Prime Video With A Twist
Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట ఇప్పటికే ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా, ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ఈ సినిమాను మే 12న థియేటర్లలో రిలీజ్ చేయగా, ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులు పూర్తయినా, ప్రేక్షకులు ఇంకా ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు వెళ్తుండటం విశేషం.
Sarkaru Vaari Paata: మహేస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. జూన్ 10 కోసం వెయిట్ చేయండి!
అయితే ఇటీవల కాలంలో సినిమాలు రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను సడెన్ గా స్ట్రీమింగ్ కు పెట్టేసి అందరికీ షాకిచ్చింది. అయితే కేవలం పే పర్ వ్యూ పద్ధతిలో మాత్రమే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక పూర్తి స్థాయిలో ఈ సినిమాను జూన్ 10న ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో పేర్కొంటోంది.
Sarkaru Vaari Paata: ‘మురారి వా..’ అంటూ మహేష్‌తో కీర్తి రొమాన్స్ షురూ!
మరి సర్కారు వారి పాట సినిమాను ఇంత త్వరగా స్ట్రీమింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, కొందరు మాత్రం ఓటీటీ నిర్వాహకులతో చిత్ర నిర్మాతలు అధిక మొత్తాన్ని తీసుకుని, ఇలా సినిమాను అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్ కు పెట్టేశారని అంటున్నారు. ఏదేమైనా మహేష్ లాంటి స్టార్ హీరో సినిమా కూడా కేవలం రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.