Sarkaru Vaari Paata: మహేస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. జూన్ 10 కోసం వెయిట్ చేయండి!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లెటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’ సమ్మర్ కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ....

Sarkaru Vaari Paata: మహేస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. జూన్ 10 కోసం వెయిట్ చేయండి!

Sarkaru Vaari Paata To Stream On Ott From June 10

Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లెటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’ సమ్మర్ కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కించడంతో ఈ మూవీ ఎలా ఉంటుందా అని అందరూ అనుకున్నారు. ఇక ఈ సినిమాలో మాస్ అంశాలను పుష్కలంగా పెట్టడంతో ఈ సినిమా చూసేందుకు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని కనబరిచారు.

Sarkaru Vaari Paata: ‘మురారి వా..’ అంటూ మహేష్‌తో కీర్తి రొమాన్స్ షురూ!

మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాకు అభిమానుల దగ్గర్నుండి బ్రహ్మాండమైన రెస్పాన్స్ దక్కింది. ఓవరాల్‌గా ఈ సినిమా కామన్ ఆడియెన్స్‌ను కూడా మెప్పించడంలో సక్సెస్ కావడంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కళ్లుచెదిరే వసూళ్లతో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులు పూర్తయిన సందర్భంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Sarkaru Vaari Paata : మహేష్ బాబు సినిమాను చూడకుండా ఎలా ఉండగలను.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..

ఇప్పటికే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే ఈ సినిమాను ఏ తేదీన ఓటీటీలో రిలీజ్ చేస్తారా అని ఇప్పుడు ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. కాగా.. ఈ సినిమాను జూన్ 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ఓ అనౌన్స్‌మెంట్‌ను జూన్ తొలివారంలో ప్రకటించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట. అంటే.. మరో పది రోజుల్లోనే సర్కారు వారి పాట ఓటీటీలో రిలీజ్ అవుతుందనే వార్తతో ఇప్పుడు మరోసారి ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మరి నిజంగానే ఈ సినిమాను జూన్ 10న ఓటీటీలో రిలీజ్ చేస్తారా లేక మరింత సమయం తీసుకుంటారా అనేది చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.