Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట వేసవి కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను...

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?

Sarkaru Vaari Paata Two Week Collections

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట వేసవి కానుకగా మే 12న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించగా, ఈ సినిమాను ఫక్తు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా కథనం కూడా బాగుండటంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు.

ఫలితంగా ఈ సినిమా తొలి వీకెండ్ ముగిసే సరికి అదిరిపోయే వసూళ్లను రాబట్టి మహేష్ స్టామినా ఏమిటో మరోసారి బాక్సాఫీస్‌కు రుచి చూపించింది. ఇక ఈ సినిమా తొలి వారం ముగిసినా వసూళ్ల వరదను మాత్రం తగ్గించలేదు. అయితే రెండో వారంలో ఈ సినిమాకు పోటీగా మరే ఇతర బడా సినిమా బాక్సాఫీస్ వద్ద రాకపోవడంతో.. మరో వారం ఈ సినిమాకు కలిసొచ్చింది. దీంతో రెండో వారంలోనూ వీలైనంత మేర సర్కారు వారి పాట చిత్రం వసూళ్లను రాబట్టేందుకు అవకాశం దొరికింది.

అయితే రెండు వారాల థియేట్రికల్ రన్ ముగిసే సరికి సర్కారు వారి పాట చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.106 కోట్లకు పైగా షేర్ వసూళ్లతో దుమ్ములేపింది. ఇక గ్రాస్ పరంగా ఈ సినిమా రూ.171 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మహేస్ బాబు కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధించిన రెండు వారాల కలెక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 32.77 కోట్లు
సీడెడ్ – 11.31 కోట్లు
ఉత్తరాంధ్ర – 12.21 కోట్లు
గుంటూరు – 8.35 కోట్లు
ఈస్ట్ – 8.35 కోట్లు
వెస్ట్ – 5.51 కోట్లు
కృష్ణా – 5.73 కోట్లు
నెల్లూరు – 3.41 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 87.70 కోట్లు (రూ.132 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 6.65 కోట్లు
ఓవర్సీస్ – 12.30 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.106.65 కోట్లు (గ్రాస్ రూ.171.30 కోట్లు)