Mahesh Babu : సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?? | Sarkeru Vaari Paata Pre Release Business

Mahesh Babu : సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా??

సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు.............

Mahesh Babu : సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా??

Sarkeru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. తాజాగా సర్కారు వారి పాట సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అయిపోయింది.

సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..

నైజాం – 36 కోట్లు
సీడెడ్ – 13.5 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 13 కోట్లు
ఈస్ట్ – 8.5 కోట్లు
వెస్ట్ – 7 కోట్లు
గుంటూరు – 9 కోట్లు
కృష్ణా – 7.5 కోట్లు
నెల్లూరు – 4 కోట్లు

మొత్తంగా ఈ సినిమాకి ఏపీ, తెలంగాణలో 98.5 కోట్ల బిజినెస్ జరిగింది.

ఓవ‌ర్సీస్ – 11 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 23.5 కోట్లు

టోటల్ గా సర్కారువారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా 125కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ అవ్వాలంటే దాదాపు 130 కోట్లు కలెక్ట్ చేయాలి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

×