Sathi Gani Rendu Ekaralu : సత్తిగాని రెండు ఎకరాలు.. ఆహాలో మరో సరికొత్త సినిమా టీజర్ రిలీజ్..

తాజాగా ఆహా నుంచి మరో సరికొత్త సినిమా రాబోతుంది. భారీ సినిమాలని తెరకెక్కిస్తూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సత్తిగాని రెండెకరాలు అనే కామెడీ, సస్పెన్స్ సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా ఆహా ఓటీటీలో................

Sathi Gani Rendu Ekaralu : సత్తిగాని రెండు ఎకరాలు.. ఆహాలో మరో సరికొత్త సినిమా టీజర్ రిలీజ్..

Sathi Gani Rendu Ekaralu teaser released in movie will streaming in aha from march 17

Sathi Gani Rendu Ekaralu :  తెలుగు ఓటీటీ ఆహా రకరకాల కొత్త సినిమాలు, షోలు, సీరియల్స్, సిరీస్ లతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. తెలుగు ఇండియన్ ఐడల్, అన్ స్టాపబుల్, చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్ చేంజ్.. లాంటి పలు కొత్త రకాల షోలు ఆహాకి విశేష ప్రజాదరణ తెచ్చిపెట్టాయి. ఇక ఆహా సొంతంగా కొత్త సినిమాలు చాలానే రిలీజ్ చేస్తుంది. ఒక్కో జోనర్ లో ఒక్కో సినిమా అన్నట్టు రకరకాల సరికొత్త సినిమాలు ఆహాలో ఇటీవల వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి.

తాజాగా ఆహా నుంచి మరో సరికొత్త సినిమా రాబోతుంది. భారీ సినిమాలని తెరకెక్కిస్తూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సత్తిగాని రెండెకరాలు అనే కామెడీ, సస్పెన్స్ సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా ఆహా ఓటీటీలో మార్చ్ 17 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ కామెడీతో ప్రేక్షకులని నవ్వించింది. పుష్పలో అల్లు అర్జున్ పక్కన ఉండే జగదీశ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు ఈ సినిమాలో.

Mandakini : ఆహాలో సరికొత్త సీరియల్ మందాకిని.. ఫ్రీగా చూసేయండి..

సత్తిగాని రెండెకరాలు అనే ఆసక్తికర టైటిల్ తో వస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. సత్తిగాని రెండెకరాలు దాని చుట్టూ జరిగే కథ, హీరోకి డబ్బులు అవసరం అయితే ఆ పొలాన్ని అమ్మేస్తాడా లేదా అని ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ కథ సాగనుందని సమాచారం. ఇక ఇటీవలే ఆహా టీం మహా మార్చ్ అంటూ సబ్‌స్క్రిప్షన్ ఫీజ్ తగ్గించింది ఇప్పుడు కేవలం 299 రూపాయలకే సంవత్సరం అంతా ఆహాలో అన్నీ చూసేయొచ్చు.